సెప్టెంబరు 1 నుంచి హైడ్రోజన్ బాంబుల ఎగ్జిబిషన్
ప్రత్యక్షంగా ఒక్క అణుబాంబునైనా చూడాలన్న సామాన్యుడి ఆశ తీరని కోరికే. ఎంతో మంది ఉన్నతాధికారుల సిఫార్సులుంటే తప్ప వాటిని చూసేందుకు వీలుపడదు. అయితే, సామాన్యుల కోరిక తీర్చడానికి రష్యా లో సెప్టెంబరు 1 వ తేదీ నుంచి 29 వరకు మాస్కోలో అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ బాంబుల ఎగ్జిబిషన్ జరగనుంది. రష్యాలో మొట్టమొదటి అణుబాంబుల తయారీ 1945లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి 70 ఏళ్లు నిండిన సందర్భంగా రోసటామా అనే సంస్థ ఈ అణుబాంబుల ప్రదర్శనను ఏర్పాటు […]
BY Pragnadhar Reddy19 Aug 2015 6:43 PM IST
Pragnadhar Reddy Updated On: 20 Aug 2015 9:06 AM IST
ప్రత్యక్షంగా ఒక్క అణుబాంబునైనా చూడాలన్న సామాన్యుడి ఆశ తీరని కోరికే. ఎంతో మంది ఉన్నతాధికారుల సిఫార్సులుంటే తప్ప వాటిని చూసేందుకు వీలుపడదు. అయితే, సామాన్యుల కోరిక తీర్చడానికి రష్యా లో సెప్టెంబరు 1 వ తేదీ నుంచి 29 వరకు మాస్కోలో అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ బాంబుల ఎగ్జిబిషన్ జరగనుంది. రష్యాలో మొట్టమొదటి అణుబాంబుల తయారీ 1945లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి 70 ఏళ్లు నిండిన సందర్భంగా రోసటామా అనే సంస్థ ఈ అణుబాంబుల ప్రదర్శనను ఏర్పాటు చేస్తోంది. అధ్యక్ష భవనానికి సమీపంలో ఏర్పాటు చేస్తున్న ఈ ఎగ్జిబిషన్‌లో టసార్ బాంబు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ హైడ్రోజన్ బాంబు చాలా శక్తివంతమైంది. హిరోషిమా నగరంపై అమెరికా ప్రయోగించిన బాంబు కంటే సుమారు మూడు వేల రెట్లు శక్తివంతమైంది.
Next Story