పవన్-దాసరి సినిమాకు దారేది..?
దాసరి నారాయణరావుతో కలిసి ఓ సినిమా చేస్తానని పవన్ గతంలోనే ప్రకటించాడు. ఆ విషయాన్ని దర్శక రత్న దాసరి నారాయణరావు కూడా కన్ ఫర్మ్ చేశాడు. కేవలం తను నిర్మాతగా మాత్రమే వ్యవహరిస్తానని కూడా చెప్పాడు. గట్టి సందేశాన్నిచ్చేలా ఓ బలమైన సామాజికాంశంతో సినిమా వస్తుందని ప్రకటించారు. అయితే రోజులు గడిచేకొద్దీ దాసరి-పవన్ ప్రాజెక్ట్ పై మబ్బులు కమ్ముకుంటున్నాయి. ఈ సినిమా గురించి ఇటు దాసరి కానీ, అటు పవన్ కానీ ఎలాంటి ప్రకటనలు చేయడం లేదు. […]
BY admin20 Aug 2015 12:30 AM IST

X
admin Updated On: 20 Aug 2015 9:10 AM IST
దాసరి నారాయణరావుతో కలిసి ఓ సినిమా చేస్తానని పవన్ గతంలోనే ప్రకటించాడు. ఆ విషయాన్ని దర్శక రత్న దాసరి నారాయణరావు కూడా కన్ ఫర్మ్ చేశాడు. కేవలం తను నిర్మాతగా మాత్రమే వ్యవహరిస్తానని కూడా చెప్పాడు. గట్టి సందేశాన్నిచ్చేలా ఓ బలమైన సామాజికాంశంతో సినిమా వస్తుందని ప్రకటించారు. అయితే రోజులు గడిచేకొద్దీ దాసరి-పవన్ ప్రాజెక్ట్ పై మబ్బులు కమ్ముకుంటున్నాయి. ఈ సినిమా గురించి ఇటు దాసరి కానీ, అటు పవన్ కానీ ఎలాంటి ప్రకటనలు చేయడం లేదు. మరి సినిమా పరిస్థితేంటి..? వీళ్ల కాంబినేషన్ లో మూవీ ఆగిపోయిందా..? లేక కథ దొరక్క సినిమా ఆలస్యమౌతోందా..? తాజా సమాచారం ప్రకారం దాసరితో సినిమా చేసే బాధ్యతను త్రివిక్రమ్ శ్రీనివాస్ కు అప్పగించాడట పవన్. దాసరితో కలిసి కథా చర్చల్లో పాల్గొనాలని, ఓ మంచి కథను ప్రిపేర్ చేయాలని త్రివిక్రమ్ కు పురమాయించాడట. ప్రస్తుతం త్రివిక్రమ్ అదే పనిలో ఉన్నాడట. కథ సిద్ధమయ్యాక ఆ స్టోరీని ఎవరు డైరక్ట్ చేయాలనే అంశాన్ని నిర్ణయిస్తారట. ఇప్పటికే పవన్ ఖాతాలో త్రివిక్రమ్, డాలీ సిద్ధంగా ఉన్నారు. వీళ్లలో ఒకరికి దర్శకత్వ బాధ్యతలు అప్పగించే అవకాశముంది.
Next Story