రాష్ట్రమంతా సమంగా అభివృద్ధి: చంద్రబాబు
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) ఏర్పాటుతో తాడేపల్లిగూడెం రూపురేఖలు మారిపోతాయని ఏపీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబునాయుడు చెప్పారు. గురువారం తాడేపల్లిగూడెంలో నిట్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఏపీ కోసం వెంకయ్య ఢిల్లీలో అభిమన్యుడిలా పని చేస్తున్నారని, ఆయన ఢిల్లీలో ఉన్నంతవరకు రాష్ట్రానికి అన్యాయం జరగదని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాను ఆదర్శవంతంగా రూపుదిద్దాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని, దీనికి కేంద్రం కూడా తన వంతు సహకారం అందిస్తుందని ఆయన తెలిపారు. ఏడు మండలాలను […]
BY sarvi20 Aug 2015 8:59 AM IST
X
sarvi Updated On: 20 Aug 2015 8:59 AM IST
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) ఏర్పాటుతో తాడేపల్లిగూడెం రూపురేఖలు మారిపోతాయని ఏపీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబునాయుడు చెప్పారు. గురువారం తాడేపల్లిగూడెంలో నిట్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఏపీ కోసం వెంకయ్య ఢిల్లీలో అభిమన్యుడిలా పని చేస్తున్నారని, ఆయన ఢిల్లీలో ఉన్నంతవరకు రాష్ట్రానికి అన్యాయం జరగదని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాను ఆదర్శవంతంగా రూపుదిద్దాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని, దీనికి కేంద్రం కూడా తన వంతు సహకారం అందిస్తుందని ఆయన తెలిపారు. ఏడు మండలాలను ఏపీలో కలపకుంటే తాను సీఎంగా ఉండి ప్రయోజనం లేదని చెప్పినందునే కేంద్రం వాటిని రాష్ట్రంలో విలీనం చేసిందని, అమరావతిలో ప్రపంచస్థాయి రాజధానిని నిర్మించి చూపిస్తామని తెలిపారు. ఏపీని నాలెడ్జి హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని, తెలుగుదేశం ప్రభుత్వం పశ్చిమగోదావరి జిల్లా రుణం తీర్చుకోలేనిదని, అందుకే అన్ని రకాలు ఈ జిల్లాను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ జిల్లా ఇచ్చిన 15 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి ఎంతో బలం చేకూర్చారని ఆయన అన్నారు. అందుకే ఈ జిల్లాను అన్నిరకాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. నర్సాపురంలో పోర్టు నిర్మాణం, భీమవరంలో ఆక్వా విశ్వవిద్యాలయం, తాడేపల్లిగూడెంలో డిగ్రీ కళాశాల, 50 ఎకరాల్లో పేదలకు గృహ నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రయినేజీ నిర్మాణం చేపడతామని చెప్పారు. సురక్ష యోజన పథకం కింద 100 శాతం ప్రజలకు రక్షణ కల్పిస్తామని చంద్రబాబు తెలిపారు. తాడేపల్లిగూడెంలో నిట్ రావడానికి మంత్రి మాణిక్యాలరావు కృషి ఎంతో ఉందని చెప్పారు.
ఏపీ బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు
ఏపీ విద్యార్థుల భవిష్యత్ చంద్రబాబు చేతుల్లో భద్రంగా ఉందని మంత్రి గంటా శ్రీనివాస్‌రావు అన్నారు. ఇదే వేదికపై నుంచి మంత్రి మాట్లాడుతూ ఏపీలో పెట్టుబడులకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు. ర్యాగింగ్ నిరోధానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం మంత్రి గంటా స్పష్టం చేశారు.
జిల్లాపై చంద్రబాబుకు ఎంతో మమకారం
పశ్చిమగోదావరి జిల్లాపై చంద్రబాబుకు ప్రత్యేక అభిమానం ఉందని మరో మంత్రి మాణిక్యాలరావు అన్నారు. తాడేపల్లిగూడెంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే తాడేపల్లి గూడెంను విద్యాకేంద్రంగా తీర్చిదిద్దాలని అన్నారు. గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుకు చంద్రబాబు చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి మాణిక్యాలరావు కోరారు.
Next Story