ఇకపై ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్ట్
డ్రైవింగ్ లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు ఇకపై ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించనున్నట్లు రవాణాశాఖ కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా తెలిపారు. డ్రైవింగను పరీక్షించడానికి ఇన్నోవేటివ్ డ్రైవింగ్ టెస్ట్ సిస్టమ్ (ఐడీటీఎస్), వాహనాలను పరీక్షించడానికి ఇన్‌స్పెక్షన్ అండ్ సర్టిఫికేషన్ సెంటర్ (ఐ అండ్ సీ) విధానాన్ని రెండు రోజులపాటు అధ్యయనం చేసేందుకు వెళ్లిన నలుగురు సభ్యుల బృందం నగరానికి చేరుకుంది. ఈ సందర్భంగా కమిషనర్ సుల్లానియా మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇకపై ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టులు, వాహనాల ఫిట్‌నెస్‌లను […]
BY sarvi19 Aug 2015 6:36 PM IST
X
sarvi Updated On: 20 Aug 2015 4:37 AM IST
డ్రైవింగ్ లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు ఇకపై ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించనున్నట్లు రవాణాశాఖ కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా తెలిపారు. డ్రైవింగను పరీక్షించడానికి ఇన్నోవేటివ్ డ్రైవింగ్ టెస్ట్ సిస్టమ్ (ఐడీటీఎస్), వాహనాలను పరీక్షించడానికి ఇన్‌స్పెక్షన్ అండ్ సర్టిఫికేషన్ సెంటర్ (ఐ అండ్ సీ) విధానాన్ని రెండు రోజులపాటు అధ్యయనం చేసేందుకు వెళ్లిన నలుగురు సభ్యుల బృందం నగరానికి చేరుకుంది. ఈ సందర్భంగా కమిషనర్ సుల్లానియా మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇకపై ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టులు, వాహనాల ఫిట్‌నెస్‌లను నిర్వహించనున్నామని, పక్కాగా డ్రైవింగ్ చేస్తేనే లైసెన్సులు మంజూరు చేస్తామని చెప్పారు. ఈ విధానాన్ని ముందుగా నల్లగొండ జిల్లాలోని చౌటుప్పల్‌లో ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.
Next Story