ఏపికి అరకొర ప్యాకేజీ.. అది కూడా ఎన్నికల ముందే..
ఆంధ్రప్రదేశ్‌కు తప్పని తిప్పలు ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ ల చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పరిభ్రమిస్తున్నాయి. మోడీ ప్రభుత్వం బీహార్‌కు 1.25 లక్షల కోట్ల రూపాయల భారీ ప్యాకేజీని ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్‌లో ఆందోళన మొదలయ్యింది. కేంద్ర మంత్రులు చెబుతున్నట్లు ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా లేనట్లేనని, ప్రత్యేక ప్యాకేజీయే దిక్కు అనేది స్పష్టమైపోయింది. ఈ నేపథ్యంలో మనకు ప్యాకేజీ ఎప్పుడు ఇస్తారు అనే విషయమే 20న ప్రధానితో భేటీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమైన అజెండాగా ఉండే అవకాశం ఉంది. […]
BY sarvi19 Aug 2015 12:18 AM GMT
X
sarvi Updated On: 19 Aug 2015 12:18 AM GMT
ఆంధ్రప్రదేశ్‌కు తప్పని తిప్పలు
ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ ల చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పరిభ్రమిస్తున్నాయి. మోడీ ప్రభుత్వం బీహార్‌కు 1.25 లక్షల కోట్ల రూపాయల భారీ ప్యాకేజీని ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్‌లో ఆందోళన మొదలయ్యింది. కేంద్ర మంత్రులు చెబుతున్నట్లు ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా లేనట్లేనని, ప్రత్యేక ప్యాకేజీయే దిక్కు అనేది స్పష్టమైపోయింది. ఈ నేపథ్యంలో మనకు ప్యాకేజీ ఎప్పుడు ఇస్తారు అనే విషయమే 20న ప్రధానితో భేటీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమైన అజెండాగా ఉండే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌కి బీహార్ అంత ప్రాధాన్యం ఇవ్వకపోవచ్చునని వినిపిస్తోంది. సుమారుగా రు.50 వేల కోట్ల నుంచి రు.75 వేల కోట్ల వరకు ప్యాకేజీ ఇచ్చే అవకాశముందని సమాచారం. అయితే అది కూడా ఇప్పుడప్పుడే సాకారమయ్యే అవకాశాలు లేవని కేంద్ర అధికారవర్గాలంటున్నాయి. ఎందుకంటే ప్యాకేజీని ఇప్పుడు ప్రకటించినా ఎన్నికల వరకు దానిని జాప్యం చేస్తారని, బీహార్ మాదిరిగానే ఎన్నికల ముందు ఇస్తారని అంటున్నారు. అలా అయితేనే ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ప్రయోజనాలు నెరవేరతాయని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం. ఎన్నికల్లో ఎంతో కొంత ఉపయోగపడుతుందని బీజేపీ భావిస్తోందట. బీహార్ ఎన్నికల తర్వాత కీలకమైన నిర్ణయం తీసుకుంటారని బీజేపీ వర్గాలంటున్నాయి.
Next Story