ముస్లింల స్థితిపై ఆరు నెలల్లో నివేదిక
రాష్ట్రంలోని ముస్లింల సామాజిక, ఆర్థిక, విద్యా స్థితిగతులపై అధ్యయనం చేసి ఆరు నెలల్లోగా ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదిక అందజేస్తామని ముస్లింల స్థితిగతులపై అధ్యయనానికి నియమించిన కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీ చైర్మన్ జీ సుధీర్ (రిటైర్డ్ ఐఏఎస్) తెలిపారు. ముస్లింల స్థితిగతులపై తాము నివేదిక మాత్రమే ఇస్తామని, విద్యా, ఉపాధి ఇతర రంగాల్లో రిజర్వేషన్లపై సూచనలు చేయడం తమ బాధ్యత కాదని పేర్కొన్నారు. కమిషన్ సభ్యులు అమీరుల్లాఖాన్, ప్రొఫెసర్ అబ్దుల్ షాబాన్, ఎంఏ బారీ, రాష్ట్ర మైనారిటీ సంక్షేమశాఖ […]
BY sarvi18 Aug 2015 6:39 PM IST
X
sarvi Updated On: 19 Aug 2015 7:28 AM IST
రాష్ట్రంలోని ముస్లింల సామాజిక, ఆర్థిక, విద్యా స్థితిగతులపై అధ్యయనం చేసి ఆరు నెలల్లోగా ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదిక అందజేస్తామని ముస్లింల స్థితిగతులపై అధ్యయనానికి నియమించిన కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీ చైర్మన్ జీ సుధీర్ (రిటైర్డ్ ఐఏఎస్) తెలిపారు. ముస్లింల స్థితిగతులపై తాము నివేదిక మాత్రమే ఇస్తామని, విద్యా, ఉపాధి ఇతర రంగాల్లో రిజర్వేషన్లపై సూచనలు చేయడం తమ బాధ్యత కాదని పేర్కొన్నారు. కమిషన్ సభ్యులు అమీరుల్లాఖాన్, ప్రొఫెసర్ అబ్దుల్ షాబాన్, ఎంఏ బారీ, రాష్ట్ర మైనారిటీ సంక్షేమశాఖ ఇన్‌చార్జి ప్రిన్సిపల్ కార్యదర్శి జీడీ అరుణ, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ షఫి ఉల్లాతో కలిసి మంగళవారం సుధీర్ తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తామని, ఇందుకోసం త్వరలోనే నోటిఫికేషన్ జారీచేస్తామని వెల్లడించారు. కమిషన్ ఈ మెయిల్ coiformts2015@gmail.comకు కూడా సూచనలు పంపవచ్చని ఆయన సూచించారు.
Next Story