Telugu Global
Others

బస్‌ పాస్‌లకు ప్రభుత్వ రాయితీ

ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీ అందిస్తున్న బస్‌పాస్‌ రాయితీని ప్రభుత్వం పెంచింది. సాధారణంగా నెలకు బస్‌ పాస్‌కు ఎంత ఖర్చు అవుతుందో అంత మొత్తాన్ని ఉద్యోగులే భరించవలసి ఉంటుంది. కానీ ఇందులో కొంత మొత్తాన్ని ప్రభుత్వం భరించడానికి నిర్ణయించింది. ఇందువల్ల ఉద్యోగులు తీసుకునే ఆర్టీసీ బస్‌ పాస్‌లకు కొంత రాయితీ పొందే అవకాశం కలిగింది. సిటీ సబర్బన్‌ బస్‌ పాస్‌ ధర రూ.550 కాగా ఇందులో ఉద్యోగులు రూ.185 చెల్లిస్తే ప్రభుత్వం రూ.365 భరిస్తుంది. మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సులకు […]

బస్‌ పాస్‌లకు ప్రభుత్వ రాయితీ
X
ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీ అందిస్తున్న బస్‌పాస్‌ రాయితీని ప్రభుత్వం పెంచింది. సాధారణంగా నెలకు బస్‌ పాస్‌కు ఎంత ఖర్చు అవుతుందో అంత మొత్తాన్ని ఉద్యోగులే భరించవలసి ఉంటుంది. కానీ ఇందులో కొంత మొత్తాన్ని ప్రభుత్వం భరించడానికి నిర్ణయించింది. ఇందువల్ల ఉద్యోగులు తీసుకునే ఆర్టీసీ బస్‌ పాస్‌లకు కొంత రాయితీ పొందే అవకాశం కలిగింది. సిటీ సబర్బన్‌ బస్‌ పాస్‌ ధర రూ.550 కాగా ఇందులో ఉద్యోగులు రూ.185 చెల్లిస్తే ప్రభుత్వం రూ.365 భరిస్తుంది. మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సులకు రూ.650 చార్జీ కాగా ఇందులో ఉద్యోగులు రూ.285 చెల్లిస్తే.. ప్రభుత్వం రూ. 365 భరించాలని నిర్ణయించింది. కాగా మెట్రో డీలక్స్‌ బస్సులకు చార్జీ రూ.750 కాగా ఇందులో ఉద్యోగులు రూ.385 చెల్లిస్తే ప్రభుత్వం రూ.365లు భరిస్తుంది. ఈ బస్‌ పాస్‌లకు ఉద్యోగులు వారు పనిచేసే శాఖాధిపతుల ధ్రువీకరణతో పొందవలసి ఉంటుంది.
First Published:  18 Aug 2015 6:37 PM IST
Next Story