వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా అరెస్ట్
వైసీపీ మహిళా నేత , నగరి ఎమ్మెల్యే రోజాను బుధవారం నగరిలో పోలీసులు అరెస్ట్ చేశారు. వారం రోజుల క్రితం నగరి మున్సిపల్ చైర్మన్ కుమారుడు..మున్సిపల్ కమిషనర్‌పై దాడి చేసిన విషయం తెలిసిందే . ఈ కేసులో పలువురు వైసీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి నిరసనగా బుధవారం ఎమ్మెల్యే రోజా నగరిలో ఆందోళన చేపట్టారు. ఆందోళన చేస్తున్న రోజాను అరెస్ట్ చేసి తమిళనాడులోని తిరుత్తణి పీఎస్‌కు తరలించారు. కాగా అంతకుముందు ఎమ్మెల్యే రోజాను ధర్నాకు […]
BY Pragnadhar Reddy19 Aug 2015 11:20 AM IST
X
Pragnadhar Reddy Updated On: 19 Aug 2015 11:20 AM IST
వైసీపీ మహిళా నేత , నగరి ఎమ్మెల్యే రోజాను బుధవారం నగరిలో పోలీసులు అరెస్ట్ చేశారు. వారం రోజుల క్రితం నగరి మున్సిపల్ చైర్మన్ కుమారుడు..మున్సిపల్ కమిషనర్‌పై దాడి చేసిన విషయం తెలిసిందే . ఈ కేసులో పలువురు వైసీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి నిరసనగా బుధవారం ఎమ్మెల్యే రోజా నగరిలో ఆందోళన చేపట్టారు. ఆందోళన చేస్తున్న రోజాను అరెస్ట్ చేసి తమిళనాడులోని తిరుత్తణి పీఎస్‌కు తరలించారు. కాగా అంతకుముందు ఎమ్మెల్యే రోజాను ధర్నాకు ముందే అరెస్టు చేయాలని పోలీసులు చాలా ప్రయత్నం చేశారు. రోజాను అదుపులోకి తీసుకునేందుకు ఆమె ప్రయాణిస్తున్న వాహనాన్ని వెంబడించారు. ఆంధ్ర-తమిళనాడు సరిహద్దులోని పైడిపట్టు వద్ద రోజా, ఇతర ఎమ్మెల్యేల అరెస్టుకు యత్నించారు. అయినా వారికి సాధ్యం కాలేదు. స్థానికుల సహకారంతో తమిళనాడుకు వెళ్లిపోయిన రోజా ఎలాగైనా నగరికి వచ్చి ధర్నా చేయాలని ప్రయత్నించారు. ఆమె వచ్చి ధర్నా జరుపుతున్న సమయంలో పోలీసులు అరెస్ట్ చేశారు.
Next Story