Telugu Global
Cinema & Entertainment

కంచెను మెచ్చుకున్న పవన్

ఆగస్ట్ 15 కానుకగా కంచె టీజర్ విడుదలైంది. రెండో ప్రపంచయుద్ధాన్ని నేపథ్యంగా తీసుకొని దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన సినిమా ఇది. ఈ సినిమాలో వరుణ్ తేజ హీరోగా నటించాడు. ఈ సినిమా టీజర్ ను చూసిన పవన్ కల్యాణ్, వరుణ్ తేజను ప్రత్యేకంగా మెచ్చుకున్నాడు. కంచె లాంటి సినిమా చేయడం కెరీర్ కు బాగా పనికొస్తుందని ప్రోత్సహించాడు పవన్. కెరీర్ స్టార్టింగ్ లో సాయిధర్మతేజకు, వరుణ్ తేజకు ట్రయినింగ్ ఇచ్చింది పవన్ కల్యాణే. ఎలా ఉండాలి.. ఎలా […]

కంచెను మెచ్చుకున్న పవన్
X
ఆగస్ట్ 15 కానుకగా కంచె టీజర్ విడుదలైంది. రెండో ప్రపంచయుద్ధాన్ని నేపథ్యంగా తీసుకొని దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన సినిమా ఇది. ఈ సినిమాలో వరుణ్ తేజ హీరోగా నటించాడు. ఈ సినిమా టీజర్ ను చూసిన పవన్ కల్యాణ్, వరుణ్ తేజను ప్రత్యేకంగా మెచ్చుకున్నాడు. కంచె లాంటి సినిమా చేయడం కెరీర్ కు బాగా పనికొస్తుందని ప్రోత్సహించాడు పవన్. కెరీర్ స్టార్టింగ్ లో సాయిధర్మతేజకు, వరుణ్ తేజకు ట్రయినింగ్ ఇచ్చింది పవన్ కల్యాణే. ఎలా ఉండాలి.. ఎలా నటించాలి లాంటి బేసిక్స్ ను పవన్ నుంచే నేర్చుకున్నాడు వరుణ్ తేజ. అంటే దాదాపు వరుణ్ కు పవన్ కల్యాణ్ గురువు అన్నమాట. అలాంటి గురువు దగ్గరనుంచే ప్రశంసలు వచ్చేసరికి వరుణ్ ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. అంతేకాదు.. కంచెలో చేసిన పాత్ర వరుణ్ డ్రీమ్ రోల్ అనే విషయం కూడా పవన్ కు తెలుసు. అందుకే వరుణ్ తేజను ప్రత్యేకంగా ప్రశంసించాడు. ఈ విషయాన్ని నాగబాబు దగ్గర కూడా ప్రస్తావించాడు పవన్ కల్యాణ్. పవన్ ఇచ్చిన ఉత్సాహంతో ఇప్పుడు వరుణ్ కంచెపై మరింత నమ్మకం పెట్టుకున్నాడు. రిలీజ్ కు ముందే కంచె సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాల్ని పవన్ కు చూపించాలనుకుంటున్నాడు.
First Published:  19 Aug 2015 12:31 AM IST
Next Story