బీహార్‌కు 1.25 లక్షల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ
బీహార్‌లో అధికారమే లక్ష్యంగా గతకొంతకాలంగా విశ్వ ప్రయత్నాలు చేస్తోన్నబీజేపీ తాజాగా ఆ రాష్ట్రంపై లక్షల కోట్లు గుమ్మరించేందుకు సిద్ధమైంది. బీహార్ అభివృద్ధి కోసం ఏకంగా 1.25 లక్షల కోట్ల ప్యాకేజీ ఇస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. మంగళవారం బీహార్‌లో అరా నగరంలో జాతీయ రహదారుల శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రాన్ని నితీశ్ అస్తవ్యస్తం చేశారని మండిపడ్డారు. కేంద్రం సాయంవిషయంలో నితీశ్ తీవ్ర నిర్లక్ష్యం కనబరిచారని అందుకే గత యూపీఏ సర్కారును ఆలస్యంగా […]
BY sarvi19 Aug 2015 4:50 AM IST
X
sarvi Updated On: 19 Aug 2015 4:50 AM IST
బీహార్‌లో అధికారమే లక్ష్యంగా గతకొంతకాలంగా విశ్వ ప్రయత్నాలు చేస్తోన్నబీజేపీ తాజాగా ఆ రాష్ట్రంపై లక్షల కోట్లు గుమ్మరించేందుకు సిద్ధమైంది. బీహార్ అభివృద్ధి కోసం ఏకంగా 1.25 లక్షల కోట్ల ప్యాకేజీ ఇస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. మంగళవారం బీహార్‌లో అరా నగరంలో జాతీయ రహదారుల శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రాన్ని నితీశ్ అస్తవ్యస్తం చేశారని మండిపడ్డారు. కేంద్రం సాయంవిషయంలో నితీశ్ తీవ్ర నిర్లక్ష్యం కనబరిచారని అందుకే గత యూపీఏ సర్కారును ఆలస్యంగా ప్రత్యేక ప్యాకేజీ అడిగారని విమర్శించారు. అందుకే కేవలం రూ.40 వేల కోట్ల ప్యాకేజీ మాత్రమే దక్కిందని ఎద్దేవా చేశారు. నేను మొదట రూ.50 వేల కోట్ల ప్యాకేజీ అని చెప్పాను. ఇప్పుడు చెప్పండి మీకెంత కావాలి? 60, 70, 80 ఎంతకావాలి? ఏకంగా రూ 1.25 లక్షల కోట్ల సాయం ప్రకటించి సంచలనం రేకెత్తించారు. రాష్ట్రంలో జంగల్ రాజ్ నడుస్తోందని, అందుకే వారంతా ఒక్కటయ్యారని జనతా పరివార్‌ను ఉద్దేశించి విమర్శించారు. రాష్ట్రంలో నేరాలు పెరిగిపోయాయని, అవినీతి పెచ్చరిల్లిందని వ్యాఖ్యానించారు. అందుకే బీహార్‌లో మాకు అధికారం ఇవ్వండి, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటన పయనింపజేస్తామని హామీ ఇచ్చారు. సమయం చిక్కిన ప్రతిసారీ నితీశ్‌పై దుమ్మెత్తిపోసినంత పనిచేశారు.
మండిపడ్డ నేతలు
మోదీ వ్యాఖ్యలను బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఖండించారు. రాష్ట్రానికి సాయం విషయాన్ని వేలంపాటలా మార్చారని మండిపడ్డారు. కేంద్రం నిధులు విడుదల చేయకుండా ఎలా ఖర్చుచేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్‌జేడీ నేత లాలూ ప్రసాద్‌యాదవ్ బీహార్‌కు ప్రత్యేక ప్యాకేజీ కాదు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేవారు. కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ ఎన్నికల సమయంలో ఇలాంటి హామీలతో ప్రజల్ని మభ్య పెట్టడం మోదీకి మామూలేనని వ్యాఖ్యానించారు.
Next Story