Telugu Global
NEWS

ప్రధాని మోడీతో చంద్రబాబు భేటీ వాయిదా

ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో గురువారం జరగాల్సిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ప్రధాని అందుబాటులో లేకపోవడంతో ఈ సమావేశం వాయిదా పడింది. ఈనెల 25, 28, 29, 31 తేదీల్లో వీలైన రోజు చెప్పాలని సీఎంను ప్రధాని కార్యాలయం కోరినట్టు సమాచారం. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 20న చంద్రబాబు… ఏపీకి ప్రత్యేక హోదాపై మోడీని కలవాల్సి ఉంది. బీహార్‌కి ప్యాకేజీ ఇచ్చిన నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక […]

ప్రధాని మోడీతో చంద్రబాబు భేటీ వాయిదా
X
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో గురువారం జరగాల్సిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ప్రధాని అందుబాటులో లేకపోవడంతో ఈ సమావేశం వాయిదా పడింది. ఈనెల 25, 28, 29, 31 తేదీల్లో వీలైన రోజు చెప్పాలని సీఎంను ప్రధాని కార్యాలయం కోరినట్టు సమాచారం. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 20న చంద్రబాబు… ఏపీకి ప్రత్యేక హోదాపై మోడీని కలవాల్సి ఉంది. బీహార్‌కి ప్యాకేజీ ఇచ్చిన నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా డిమాండుకు బలం చేకూరింది. ఒకవేళ ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినా బీహార్‌ కన్నా ఘనంగా ఉండాలన్నది చంద్రబాబు ఆకాంక్షగా చెబుతున్నారు. దీనికి సంబంధించి ప్రధానితో సంప్రదింపులు జరిపేందుకు గురువారం అపాయింట్‌మెంట్‌ ఏర్పాటు చేసుకోగా మోడీ షెడ్యూలు మారడంతో ఈ సమావేశం వాయిదా వేశారు.
First Published:  19 Aug 2015 11:06 AM IST
Next Story