కల్తీ కిరోసిన్ పట్టివేత
బోడుప్పల్ పరిధిలోని గోదాంలో రెండు లారీల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 35 వేల లీటర్ల కల్తీ కిరోసిన్‌ను హైదరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోదాం యజమాని గోవిందరాజు, సూపర్‌వైజర్ ప్రకాశరావుతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. కల్తీ కిరోసిన్ సమాచారం అందుకున్న పోలీసులు సోమవారం రాత్రి మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడుప్పల్ హేమానగర్ ఎంసీ కాలనీపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో కల్తీ కిరోసిన్ తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. […]
BY sarvi18 Aug 2015 6:45 PM IST
X
sarvi Updated On: 19 Aug 2015 9:32 AM IST
బోడుప్పల్ పరిధిలోని గోదాంలో రెండు లారీల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 35 వేల లీటర్ల కల్తీ కిరోసిన్‌ను హైదరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోదాం యజమాని గోవిందరాజు, సూపర్‌వైజర్ ప్రకాశరావుతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. కల్తీ కిరోసిన్ సమాచారం అందుకున్న పోలీసులు సోమవారం రాత్రి మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడుప్పల్ హేమానగర్ ఎంసీ కాలనీపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో కల్తీ కిరోసిన్ తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. ఈ ముఠా పరిశ్రమల్లో వృథాగా పోయే మడ్ ఆయిల్‌ను కిరోసిన్‌లో కలిపి పరిశ్రమలకు, పెట్రోల్ బంకులకు విక్రయిస్తోందని పోలీసులు వెల్లడించారు. దీంతో పెట్రోల్ బంకుల్లో ఇంథనం కల్తీ జరిగి వాహనాలు చెడిపోతున్నాయని పోలీసులు చెప్పారు. కర్ణాటక నుంచి వస్తోన్న లారీలో 42 డ్రమ్ముల కల్తీ ఇంజిన్ ఆయిల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నామని డ్రైవర్‌తో పాటు మరోవ్యక్తిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.
Next Story