Telugu Global
Others

నేడు  క‌డ‌ప బంద్ 

నారాయ‌ణ జూనియ‌ర్ క‌ళాశాల్లో ఇద్ద‌రు విద్యార్థినుల ఆత్మ‌హ‌త్య‌తో క‌డ‌ప న‌గ‌రం అట్టుడికింది. ఈ విద్యాసంస్థ‌ల అధినేత మంత్రి నారాయ‌ణ‌ను వెంట‌నే అరెస్ట్ చేయాల‌ని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు, రాజ‌కీయ పార్టీలు బుధ‌వారం క‌డ‌ప బంద్ పాటించ‌డంతో పాటు రాష్ట్ర‌వ్యాప్తంగా నిర‌స‌న‌లు ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌ట్టాల‌ని పిలుపునిచ్చాయి. విద్యార్ధుల ఆత్మ‌హ‌త్యలకు నిర‌స‌న‌గా క‌డ‌ప‌లో విద్యార్థి సంఘాలు, ప్ర‌జా సంఘాలు నిర్వ‌హించిన ఆందోళ‌న‌లో ప్ర‌తిప‌క్ష‌నేత జ‌గ‌న్ స్వ‌యంగా పాల్గొన్నారు. విద్యార్ధుల మృత‌దేహాల‌ను హైద‌రాబాద్ కు త‌ర‌లించి రీపోస్ట్‌మార్టం నిర్వ‌హించాల‌ని ఆయ‌న […]

నేడు  క‌డ‌ప బంద్ 
X
నారాయ‌ణ జూనియ‌ర్ క‌ళాశాల్లో ఇద్ద‌రు విద్యార్థినుల ఆత్మ‌హ‌త్య‌తో క‌డ‌ప న‌గ‌రం అట్టుడికింది. ఈ విద్యాసంస్థ‌ల అధినేత మంత్రి నారాయ‌ణ‌ను వెంట‌నే అరెస్ట్ చేయాల‌ని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు, రాజ‌కీయ పార్టీలు బుధ‌వారం క‌డ‌ప బంద్ పాటించ‌డంతో పాటు రాష్ట్ర‌వ్యాప్తంగా నిర‌స‌న‌లు ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌ట్టాల‌ని పిలుపునిచ్చాయి. విద్యార్ధుల ఆత్మ‌హ‌త్యలకు నిర‌స‌న‌గా క‌డ‌ప‌లో విద్యార్థి సంఘాలు, ప్ర‌జా సంఘాలు నిర్వ‌హించిన ఆందోళ‌న‌లో ప్ర‌తిప‌క్ష‌నేత జ‌గ‌న్ స్వ‌యంగా పాల్గొన్నారు. విద్యార్ధుల మృత‌దేహాల‌ను హైద‌రాబాద్ కు త‌ర‌లించి రీపోస్ట్‌మార్టం నిర్వ‌హించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు కూడా నారాయ‌ణ క‌ళాశాల‌ల్లో భాగం ఉంద‌ని, అందుకే ఆయ‌నపై చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని జ‌గ‌న్ ఆరోపించారు. విద్యార్ధుల ఆత్మ‌హ‌త్య‌ల‌తో క‌ళాశాల‌కు సంబంధం లేద‌న్న‌ట్లు ల‌వ్‌లెట‌ర్‌లు సృష్టించారని ప్ర‌తిప‌క్ష‌ నేత ఆరోపించారు. విద్యార్ధుల ఆత్మ‌హ‌త్య‌ల‌పై సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి పి. మ‌ధు అనుమానాలు వ్య‌క్తం చేశారు. అవి ఆత్మ‌హ‌త్య‌లు కావ‌ని ఆయ‌న అన్నారు. విద్యార్ధుల మృతిపై ఆందోళ‌న చేస్తున్న విద్యార్థి సంఘ నాయ‌కుల అరెస్ట్‌ను మ‌ధు ఖండించారు. ఈ వ్య‌వ‌హారంపై స్పందించిన‌ రాష్ట్ర ప్ర‌భుత్వం విద్యార్ధుల ఆత్మ‌హ‌త్య‌ల‌పై విచార‌ణ‌కు త్రిస‌భ్య‌క‌మిటీని నియ‌మించింది. ఆత్మ‌హ‌త్య‌ల‌కు కార‌ణాలు వెల్ల‌డైన త‌ర్వాత బాధ్యుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ప్ర‌క‌టించింది.
First Published:  18 Aug 2015 6:43 PM IST
Next Story