జర నవ్వండి ప్లీజ్ 179
అలవాటులో… బంటీ ఒక నర్సును గాఢంగా ప్రేమించాడు. ఆమెకు ఉత్తరం ఎలా రాయాలా అని సీరియస్‌గా ఆలోచించాడు. చివరకు “డియర్! సిస్టర్!” అని ఉత్తరం మొదలుపెట్టాడు. ———————————————————————————— తొలిప్రేమ సుమన్: నేను ఉదయాన నిద్ర లేస్తూనే మొదట నువ్వే గుర్తొస్తావు సుజి: రమేశ్ కూడా అదే మాట అన్నాడు. సుమన్: వాడికన్నా ముందే నేను నిద్రలేస్తాను. ———————————————————————————— ప్లాస్టిక్ పూలు “వెయిటర్ ఈ టేబుల్ మీద ఉన్నవి నిజమైన పూలా? ఆర్టిఫిషియల్ పూలా?” “సార్! కొంతకాలం క్రితం […]
అలవాటులో…
బంటీ ఒక నర్సును గాఢంగా ప్రేమించాడు.
ఆమెకు ఉత్తరం ఎలా రాయాలా అని సీరియస్‌గా ఆలోచించాడు.
చివరకు “డియర్! సిస్టర్!” అని ఉత్తరం మొదలుపెట్టాడు.
————————————————————————————
తొలిప్రేమ
సుమన్: నేను ఉదయాన నిద్ర లేస్తూనే మొదట నువ్వే గుర్తొస్తావు
సుజి: రమేశ్ కూడా అదే మాట అన్నాడు.
సుమన్: వాడికన్నా ముందే నేను నిద్రలేస్తాను.
————————————————————————————
ప్లాస్టిక్ పూలు
“వెయిటర్ ఈ టేబుల్ మీద ఉన్నవి నిజమైన పూలా? ఆర్టిఫిషియల్ పూలా?”
“సార్! కొంతకాలం క్రితం దాకా ఇక్కడ నిజమైన పూలే పెట్టేవాళ్లం. మాది వెజిటేరియన్ రెస్టారెంట్ కదా! ఆలస్యమయితే జనం అవి తినే వాళ్లు. అందుకని ప్లాస్టిక్ పూలు పెట్టాం!”
————————————————————————————
మాటకు మాట
మహిళ: ఏమయ్యా! ఆరోగ్యంగా ఉన్నావు. బిచ్చమెత్తుకోవడమెందుకు? ఏదయినా పనిచేసుకుని బతకవచ్చు గదా!
బిచ్చగాడు: అమ్మా! ఏమీ అనుకోకండి. మిమ్మల్ని చూస్తే చాలా అందంగా ఉన్నారు. కానీ సినిమాల్లోకి వెళ్లకుండా ఎందుకు మామూలుగా బతుకుతున్నారు?