వరంగల్‌లో ఈనెల 24 నుంచి షర్మిల యాత్ర
వైఎస్సార్ సీపీ నాయకురాలు షర్మిల ఈ నెల 24 నుంచి వరంగల్‌లో ఐదురోజులపాటు పర్యటించనున్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి మరణాన్ని తట్టుకోలేక వరంగల్ జిల్లాలో మరణించిన 32 కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. షర్మిల పరామర్శ యాత్ర వివరాలను పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి లోటస్‌పాండ్‌లో మీడియాకు వెల్లడించారు. 24వ తేదీన ఉదయం 9 గంటలకు షర్మిల లోటస్‌పాండ్ నుంచి బయల్దేరుతారు. శామీర్‌పేట్, ప్రజ్ఞాపూర్ మీదుగా ఉదయం 11 గంటలకు చేర్యాల బన్వగల్ల యాదగిరి కుటుంబాన్ని పరామర్శిస్తారు. […]
BY sarvi17 Aug 2015 6:37 PM IST

X
sarvi Updated On: 18 Aug 2015 6:21 AM IST
వైఎస్సార్ సీపీ నాయకురాలు షర్మిల ఈ నెల 24 నుంచి వరంగల్‌లో ఐదురోజులపాటు పర్యటించనున్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి మరణాన్ని తట్టుకోలేక వరంగల్ జిల్లాలో మరణించిన 32 కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. షర్మిల పరామర్శ యాత్ర వివరాలను పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి లోటస్‌పాండ్‌లో మీడియాకు వెల్లడించారు. 24వ తేదీన ఉదయం 9 గంటలకు షర్మిల లోటస్‌పాండ్ నుంచి బయల్దేరుతారు. శామీర్‌పేట్, ప్రజ్ఞాపూర్ మీదుగా ఉదయం 11 గంటలకు చేర్యాల బన్వగల్ల యాదగిరి కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఆ రోజు మరో ఆరు కుటుంబాలను పరామర్శిస్తారు. 25,26,27 తేదీల్లో రోజుకు ఏడు కుటుంబాల చొప్పున పరామర్శించి, ఆఖరి రోజైన 28వ తేదీన నాలుగు కుటుంబాలను పరామర్శిస్తారని ఆయన చెప్పారు.
Next Story