అగ్రిగోల్డ్ ఆస్తులమ్మితే అప్పులు తీరతాయా?: హైకోర్టు
అగ్రిగోల్డ్ సంస్థ కోర్టుకు సమర్పించిన 14 ఆస్తులను అమ్మితే డిపాజిటర్లకు చెల్లించాల్సిన రూ.6,350 కోట్ల డబ్బు లభిస్తుందా? ఆ సంస్థకున్న మొత్తం ఆస్తి వివరాలను తమ ముందు ఉంచాలని హైకోర్టు అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని ఆదేశించింది. నిందితులు తమ ఆస్తులను అమ్మి డిపాజిటర్లకు సొమ్ము చెల్లిస్తానని రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వా వెంకటరామారావు, ఇతర డైరెక్టర్లకు హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. సామాన్యుల నుంచి అగ్రిగోల్డ్ సేకరించిన రూ. 6,350 కోట్ల కుంభకోణంపై సీబీఐ విచారణ […]
BY sarvi17 Aug 2015 6:38 PM IST
X
sarvi Updated On: 18 Aug 2015 6:27 AM IST
అగ్రిగోల్డ్ సంస్థ కోర్టుకు సమర్పించిన 14 ఆస్తులను అమ్మితే డిపాజిటర్లకు చెల్లించాల్సిన రూ.6,350 కోట్ల డబ్బు లభిస్తుందా? ఆ సంస్థకున్న మొత్తం ఆస్తి వివరాలను తమ ముందు ఉంచాలని హైకోర్టు అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని ఆదేశించింది. నిందితులు తమ ఆస్తులను అమ్మి డిపాజిటర్లకు సొమ్ము చెల్లిస్తానని రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వా వెంకటరామారావు, ఇతర డైరెక్టర్లకు హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. సామాన్యుల నుంచి అగ్రిగోల్డ్ సేకరించిన రూ. 6,350 కోట్ల కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలని కోరుతూ అగ్రిగోల్డ్ డిపాజిట్ల, ఏజెంట్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎ.రమేష్‌బాబు హైకోర్టులో దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాలవ్యాజ్యంపై ధర్మాసనం విచారణ జరిపింది. డిపాజిటర్లకు న్యాయం చేయడమే న్యాయస్థానం లక్ష్యమని అందుకే అఫిడవిట్ కోరుతున్నామని ప్రకటించింది. కోర్టుకు అఫిడవిట్ సమర్పించిన తర్వాత తదుపరి ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రకటించిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.
Next Story