Telugu Global
Others

స్పీకర్‌ కోడెల కుమార్తెపై భూకబ్జా, కిడ్నాప్‌ కేసు!

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభా స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కుమార్తె డాక్టర్‌ విజయలక్ష్మి అక్రమ చర్యలపై దర్యాప్తు జరపాల్సిందిగా స్థానిక న్యాయస్థానం గుంటూరు రూరల్‌ పోలీసులను ఆదేశించింది. భూకబ్జా, కిడ్నాప్‌, మోసం, నేరపూరిత కుట్ర తదితర అక్రమ చర్యలకు పాల్పడ్డారంటూ కోడెల కుమార్తె విజయలక్ష్మితోపాటు ఆమె అనుచరులైన మరో ఆరుగురిపై కోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి ఈ చర్యలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. పెడ్చెర్లకు చెందిన కొండూరి శివలక్ష్మి తరఫున గుంటూరు బార్‌ అసోసియేషన్‌ […]

స్పీకర్‌ కోడెల కుమార్తెపై భూకబ్జా, కిడ్నాప్‌ కేసు!
X
ఆంధ్రప్రదేశ్‌ శాసనసభా స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కుమార్తె డాక్టర్‌ విజయలక్ష్మి అక్రమ చర్యలపై దర్యాప్తు జరపాల్సిందిగా స్థానిక న్యాయస్థానం గుంటూరు రూరల్‌ పోలీసులను ఆదేశించింది. భూకబ్జా, కిడ్నాప్‌, మోసం, నేరపూరిత కుట్ర తదితర అక్రమ చర్యలకు పాల్పడ్డారంటూ కోడెల కుమార్తె విజయలక్ష్మితోపాటు ఆమె అనుచరులైన మరో ఆరుగురిపై కోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి ఈ చర్యలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. పెడ్చెర్లకు చెందిన కొండూరి శివలక్ష్మి తరఫున గుంటూరు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, సీనియర్‌ అడ్వకేట్‌ జి. శాంతకుమార్‌ స్పెషల్‌ జ్యుడీషియల్‌ మొబైల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో ఈ పిటిషన్‌ దాఖలు చేస్తూ తమ ఫిర్యాదును నమోదు చేసుకోవలసిందిగా పోలీసులను ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. 14 యేళ్ళ క్రితం డాక్టర్‌ విజయలక్ష్మి 150 మంది అనుచరులతో వచ్చి తాము నివాసముంటున్న 2.68 ఎకరాలను కబ్జా చేశారని, అడ్డుకున్న తమను చితకబాదారని, అదే సమయంలో ఇంట్లో ఉన్న 1.8 లక్షల రూపాయల నగదును, 120 గ్రాముల బంగారాన్ని కూడా దోచుకుపోయారని తమ పిటిషన్‌లో శివలక్ష్మి ఆరోపించారు. ఈ స్థలాన్ని 2001లో తాము కొన్నామని చెబుతూ జులై 22న జరిగిన ఈ సంఘటనపై పోలీసుల వద్దకు వెళితే తమ ఫిర్యాదును వారు తీసుకోలేదని తెలిపారు. జులై 25న తమ మూడో కుమారుడు అంజిరెడ్డిని కిడ్నాప్‌ చేసుకుని తీసుకుపోయి బలవంతంగా నల్లపాడు సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులో విజయలక్ష్మి పేరుతో రిజిస్టర్‌ చేయించుకున్నారని, ఈ వ్యవహారానికి సంబంధించి తమకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ వివరాలన్నీ చూసిన న్యాయమూర్తి ఈ ఫిర్యాదును నమోదు చేసుకుని విచారణ జరిపి ప్రస్తుతమున్న పరిస్థితిని తెలియజేయాలని గుంటూరు రూరల్‌ పోలీసులను ఆదేశించారు.
First Published:  18 Aug 2015 3:07 AM GMT
Next Story