కేకేకు అస్వస్థత నిమ్స్‌లో చేరిక!
టీఆర్ ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని తెలిసింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను నిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 1939లో అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా మానుకోటలో జూన్ 9న కేశవరావు జన్మించారు. హైదరాబాద్‌లోని భద్రుకా కాలేజీలో బీ.కామ్ చదివారు. ఉస్మానియా నుంచి ఎమ్.ఏలో పీహెచ్‌డీ చేశారు. విద్యావంతుడైన కేశవరావు కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవులు నిర్వహించారు. ఏఐసీసీ సభ్యుడిగా, […]
BY sarvi18 Aug 2015 6:47 AM IST
X
sarvi Updated On: 18 Aug 2015 6:47 AM IST
టీఆర్ ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని తెలిసింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను నిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 1939లో అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా మానుకోటలో జూన్ 9న కేశవరావు జన్మించారు. హైదరాబాద్‌లోని భద్రుకా కాలేజీలో బీ.కామ్ చదివారు. ఉస్మానియా నుంచి ఎమ్.ఏలో పీహెచ్‌డీ చేశారు. విద్యావంతుడైన కేశవరావు కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవులు నిర్వహించారు. ఏఐసీసీ సభ్యుడిగా, ఈశాన్య రాష్ట్రాల కాంగ్రెస్ పరిశీలకుడిగా పనిచేశారు. ఏపీ రాష్ట్రంలో వైఎస్ సీఎంగా ఉన్నపుడు రాజ్యసభకు ఎంపికయ్యారు. తెలంగాణ ఉద్యమనేపథ్యంలో టీఆర్ ఎస్‌లో చేరారు. ప్రస్తుతం అదే పార్టీ నుంచి రాజ్యసభ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేశవరావు విద్యావేత్త, మేథావిగా పేరుగాంచారు. హైదరాబాద్ రాష్ట్రం నుంచి వెలువడే ద న్యూస్ డెయిలీకి ఎడిటర్‌గా పనిచేశారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన నేతల్లో ఒకరు.
Next Story