Telugu Global
Cinema & Entertainment

కోబలి కాదు కబలి

చాలా కాలంగా మనం ‘కోబలి ‘ అనే టైటిల్‌ని వింటున్నాం. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ రాబోయే చిత్రాలలో ఇది ఒకటి అనే కాన్సెప్ట్ బాగా ఎస్టాబ్లిష్ అయ్యింది. సరిగ్గా ఇదే టైటిల్‌ని స్ఫురించే ఇంకో టైటిల్ ఇపుడు ఆగా హల్చల్ చేస్తోంది. అది ‘కబలి ‘. త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోయే రజినికాంత్ తదుపరి సినిమా టైటిల్ అచ్చం మన పవన్ కల్యాణ్ కోసం త్రివిక్రం శ్రీనివాస్ అనుకున్న టైటిల్‌నే తలపిస్తోంది. కేవలం ఒక ఒత్తు తేడా […]

కోబలి కాదు కబలి
X

చాలా కాలంగా మనం ‘కోబలి ‘ అనే టైటిల్‌ని వింటున్నాం. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ రాబోయే చిత్రాలలో ఇది ఒకటి అనే కాన్సెప్ట్ బాగా ఎస్టాబ్లిష్ అయ్యింది. సరిగ్గా ఇదే టైటిల్‌ని స్ఫురించే ఇంకో టైటిల్ ఇపుడు ఆగా హల్చల్ చేస్తోంది. అది ‘కబలి ‘. త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోయే రజినికాంత్ తదుపరి సినిమా టైటిల్ అచ్చం మన పవన్ కల్యాణ్ కోసం త్రివిక్రం శ్రీనివాస్ అనుకున్న టైటిల్‌నే తలపిస్తోంది. కేవలం ఒక ఒత్తు తేడా అంతే.
లింగా తర్వాత, రజినీ సినిమా ఈ సెప్టెంబర్‌లో మొదలవుతుంది. పా రంజిత్ అనే యువ దర్సకుడితో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉండబోతుంది. ముందు ‘కాళీ ‘ అనే టైటిల్ బాగా సందడి చేసింది. తర్వాత కూడా రెండు మూడు పేర్లు బాగా హల్చల్ చేసాయి. ఫైనల్‌గా ‘కబలి ‘ అనే టైటిల్‌ని అఫీషియల్‌గా ప్రటించారు. ఈ సినిమాలో రాధికా ఆప్టే రజినీకి జంటగా నటిస్తోంది. దన్సిక అనే తమిళ యాక్టర్ రజినీకి కూతురుగా చేస్తోంది.

First Published:  18 Aug 2015 12:30 AM IST
Next Story