ఆ 'ముగ్గురూ' కేంద్రం చేతిలో కీలుబొమ్మలే: నారాయణ
ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్‌లతోపాటు ప్రతిపక్షనేత జగన్‌ను కేంద్రం తన చెప్పుచేతల్లో పెట్టుకొని కీలుబొమ్మల్లా ఆడిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యులు నారాయణ విమర్శించారు. తెలుగురాష్ట్రాల మధ్య ఏర్పడిన కలహాలను పరిష్కరించకుండా కేంద్రం చోద్యం చూస్తోందని నారాయణ విమర్శించారు. హైదరాబాద్‌లో జరిగిన సీపీఐ రాష్ట్ర సమితి సమావేశంలో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. కేంద్రం వల్లనే తెలంగాణ, ఏపీలు పోట్లాడుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని హామీ ఇచ్చిన బీజేపీ […]
BY sarvi17 Aug 2015 6:43 PM IST
X
sarvi Updated On: 18 Aug 2015 8:55 AM IST
ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్‌లతోపాటు ప్రతిపక్షనేత జగన్‌ను కేంద్రం తన చెప్పుచేతల్లో పెట్టుకొని కీలుబొమ్మల్లా ఆడిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యులు నారాయణ విమర్శించారు. తెలుగురాష్ట్రాల మధ్య ఏర్పడిన కలహాలను పరిష్కరించకుండా కేంద్రం చోద్యం చూస్తోందని నారాయణ విమర్శించారు. హైదరాబాద్‌లో జరిగిన సీపీఐ రాష్ట్ర సమితి సమావేశంలో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. కేంద్రం వల్లనే తెలంగాణ, ఏపీలు పోట్లాడుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని హామీ ఇచ్చిన బీజేపీ ఇప్పుడు రాజకీయ అవకాశవాదంతో మాట మార్చిందని విమర్శించారు. తెలంగాణ ప్రజలను మద్యానికి బానిసలను చేసేందుకు సీఎం కేసీఆర్ చీప్ లిక్కర్‌ను ప్రవేశపెడుతున్నారని నారాయణ ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ అహంకారం పరాకాష్టకు చేరిందని, అపాయింట్‌మెంట్ కోరినా ఇవ్వకపోవడం సరికాదని ఆయన దుయ్యబట్టారు.
Next Story