గవర్నర్ పై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం తన మనస్సులో బాధను బయటకు వెళ్లగక్కారు. విభజన చట్టం లోపాలను ఎత్తిచూపుతూ.. నరసింహన్ తీరుపై పలు వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి రాజధాని శాంతిభద్రతలను గవర్నర్ ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ నిట్టూర్చారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు రాష్ట్ర విభజన వలన తలెత్తిన సమస్యలను వివరించారు. విభజన తీరు సరిగా ఉంటే ఇన్ని సమస్యలు వచ్చేవి కావని ఆయన […]
BY sarvi18 Aug 2015 6:42 AM IST
X
sarvi Updated On: 18 Aug 2015 9:31 AM IST
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం తన మనస్సులో బాధను బయటకు వెళ్లగక్కారు. విభజన చట్టం లోపాలను ఎత్తిచూపుతూ.. నరసింహన్ తీరుపై పలు వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి రాజధాని శాంతిభద్రతలను గవర్నర్ ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ నిట్టూర్చారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు రాష్ట్ర విభజన వలన తలెత్తిన సమస్యలను వివరించారు. విభజన తీరు సరిగా ఉంటే ఇన్ని సమస్యలు వచ్చేవి కావని ఆయన అన్నారు. ‘రాష్ర్ట విభజన బిల్లు-లోపాలు’ పేరుతో మూడో వివరణ పత్రాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా విడుదల చేశారు. అనంతరం మాట్లాడిన సీఎం గవర్నర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి రాజధానిలో ఆంధ్ర ప్రజలకు.. రక్షణ లేదు.. చట్ట ప్రకారం వ్యవహరించాల్సిన గవర్నర్ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజల ఆస్తుల రక్షణ కోసమే విభజన చట్టంలో సెక్షన్-8 పొందుపరిచారని, దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత గవర్నర్‌దేనని సీఎం స్పష్టం చేశారు. ముఖ్యులకే ఇబ్బందులు ఉన్నప్పుడు సామాన్యుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు.
Next Story