Telugu Global
Others

చంద్ర‌బాబుకు కేంద్రం ఝ‌ల‌క్‌

ఆరోగ్య మిష‌న్ క‌మిటీల‌పై బాబు నిర్ణ‌యం చెల్ల‌ద‌ని ఆదేశాలు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు కేంద్రం ఊహించ‌ని షాక్ ఇచ్చింది. జాతీయ ఆరోగ్య మిష‌న్ (ఎన్‌హెచ్ఎం) జిల్లాస్థాయి విజిలెన్స్ అండ్ మోనిట‌రింగ్ క‌మిటీల చైర్మ‌న్లుగా తాము ఎంపిక చేసిన ఎంపీల‌నే కొన‌సాగించాల‌ని స్ప‌ష్టంగా ఆదేశించింది. ఈ క‌మిటీల‌కు చైర్మ‌న్లుగా తెలుగుదేశం ఎంపీల‌ను నియ‌మిస్తూ ఇటీవ‌లే చంద్ర‌బాబు నాయుడు ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఆ నోటిఫికేష‌న్ చెల్ల‌ద‌ని, తాము ఎంపిక చేసిన ఎంపీల‌నే కొన‌సాగించాల‌ని కేంద్ర […]

చంద్ర‌బాబుకు కేంద్రం ఝ‌ల‌క్‌
X
ఆరోగ్య మిష‌న్ క‌మిటీల‌పై బాబు నిర్ణ‌యం చెల్ల‌ద‌ని ఆదేశాలు
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు కేంద్రం ఊహించ‌ని షాక్ ఇచ్చింది. జాతీయ ఆరోగ్య మిష‌న్ (ఎన్‌హెచ్ఎం) జిల్లాస్థాయి విజిలెన్స్ అండ్ మోనిట‌రింగ్ క‌మిటీల చైర్మ‌న్లుగా తాము ఎంపిక చేసిన ఎంపీల‌నే కొన‌సాగించాల‌ని స్ప‌ష్టంగా ఆదేశించింది. ఈ క‌మిటీల‌కు చైర్మ‌న్లుగా తెలుగుదేశం ఎంపీల‌ను నియ‌మిస్తూ ఇటీవ‌లే చంద్ర‌బాబు నాయుడు ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఆ నోటిఫికేష‌న్ చెల్ల‌ద‌ని, తాము ఎంపిక చేసిన ఎంపీల‌నే కొన‌సాగించాల‌ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త కార్య‌ద‌ర్శి మ‌నోజ్ ఝ‌లానీ ఈనెల 14న రాష్ట్ర ఆరోగ్య శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి పూనం మాల‌కొండ‌య్య‌కు ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఎన్‌హెచ్ఎం జిల్లా చైర్మ‌న్లుగా ఎవ‌రుండాల‌నే విష‌యంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నిర్దిష్ట‌మైన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేస్తే చంద్ర‌బాబు ప్ర‌భుత్వం వాటిని పూర్తిగా ఉల్లంఘించింది. మార్గ‌ద‌ర్శ‌కాల్లోని క్లాజు 3-1 ప్ర‌కారం సంబంధిత జిల్లా నుంచి ఎన్నికైన లోక్‌స‌భ స‌భ్యుడే స‌ద‌రు క‌మిటీకి చైర్మ‌న్‌గా ఉండాల‌ని స్ప‌ష్టంగా ఉంది. ఎన్‌హెచ్ఎం ప్ర‌కాశం జిల్లా చైర్మ‌న్‌గా అదే జిల్లాకు చెందిన ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, నెల్లూరు మిష‌న్ చైర్మ‌న్‌గా ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డిని, వైఎస్ఆర్ జిల్లా చైర్మ‌న్‌గా వైఎస్ అవినాష్‌రెడ్డిని నియ‌మిస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ 2015 మార్చి 30న ఉత్త‌ర్వులు జారీ చేసింది. అలాగే ఇత‌ర జిల్లాల్లో కూడా అక్క‌డి లోక్‌స‌భ స‌భ్యుల్లో సీనియ‌ర్ల‌ను కేంద్రం నియ‌మించింది. అలా నియ‌మించిన వారిలో టీడీపీ కి చెందిన వారు కూడా ఉన్నారు. అయితే రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఐవైఆర్ కృష్ణారావు కేంద్ర మార్గ‌ద‌ర్శ‌కాల‌కు విరుద్ధంగా అన్నిచోట్లా టీడీపీవారిని నియ‌మిస్తూ నోటిఫికేష‌న్ జారీ చేశారు. ఎక్క‌డైతే వైఎస్ఆర్సీపీ లోక్‌స‌భ స‌భ్యులు చైర్మ‌న్లుగా ఉన్నారో వారి స్థానంలో టీడీపీ వారిని నియ‌మించారు. వైఎస్ఆర్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్థానంలో బాప‌ట్ల ఎంపీ శ్రీ‌రాం మాల్యాద్రిని, నెల్లూరు ఎంపీ మేక‌పాటి స్థానంలో ప‌శ్చిమ గోదావ‌రికి చెందిన ఎంపీ తోట మ‌హాల‌క్ష్మిని, క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి స్థానంలో రాజ్య‌స‌భ స‌భ్యుడు సీఎం ర‌మేష్‌ని నియ‌మిస్తూ 2015 మే 6న చంద్ర‌బాబు ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్‌ను జారీ చేసింది. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జ‌గ‌త్ ప్ర‌కాశ్ న‌డ్డాకు వైవీ సుబ్బారెడ్డి జూన్ 17న ఫిర్యాదు చేశారు. దాంతో సీఎస్ జారీ చేసిన నోటిఫికేష‌న్‌ను ర‌ద్దు చేయాల్సిందిగా కేంద్రం నుంచి ఆదేశాలొచ్చాయి. ఈ వివ‌రాల‌ను వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విలేక‌రుల‌కు వెల్ల‌డించారు.
First Published:  17 Aug 2015 9:38 PM GMT
Next Story