Telugu Global
Others

సారా వ్యతిరేక ఉద్యమానికి సిద్ధమైన ప్రతిపక్షాలు

తెలంగాణలో సారా వ్యతిరేక ఉద్యమానికి ప్రతిపక్షాలు శ్రీకారం చుట్టాయి. అన్ని పార్టీలు కలిసి జేఏసీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఇందులో బీజేఎల్పీ నేత లక్ష్మణ్, కాంగ్రెస్‌ నాయకుడు పొన్నాల, మల్లు స్వరాజ్యం తదితర ముఖ్యనేతలు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చీప్‌ లిక్కర్‌ పేరుతో ప్రజల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం చేస్తుందని ఆయా పార్టీల నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. సారాను నిషేధించే వరకూ ప్రతిపక్షాల ఆధ్వర్యంలో ఆందోళనలను […]

తెలంగాణలో సారా వ్యతిరేక ఉద్యమానికి ప్రతిపక్షాలు శ్రీకారం చుట్టాయి. అన్ని పార్టీలు కలిసి జేఏసీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఇందులో బీజేఎల్పీ నేత లక్ష్మణ్, కాంగ్రెస్‌ నాయకుడు పొన్నాల, మల్లు స్వరాజ్యం తదితర ముఖ్యనేతలు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చీప్‌ లిక్కర్‌ పేరుతో ప్రజల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం చేస్తుందని ఆయా పార్టీల నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. సారాను నిషేధించే వరకూ ప్రతిపక్షాల ఆధ్వర్యంలో ఆందోళనలను నిర్వహించాలని నేతలు తీర్మానించారు.
First Published:  17 Aug 2015 6:51 PM IST
Next Story