కెమికల్ ఫ్యాక్టరీపై గ్రామస్తుల దాడి
తమ పంట పొలాలు నాశనమై పోతున్నాయని, తమకు శారీరక సమస్యలు ఎదురవుతున్నాయంటూ నెల్లూరు జిల్లా వింజమూరు మండలం చంద్రపడియ గ్రామస్తులు ఓ కెమికల్ ఫ్యాక్టరీపై దాడి చేశారు. దీన్ని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆందోళనకారులు రెచ్చిపోవడంతో పోలీసులు లాఠీఛార్జి చేయాల్సి వచ్చింది. విష వాయువులు వెలువరించే ఈ ఫ్యాక్టరీని తొలగించాలని వారు డిమాండు చేశారు. గతంలో దీన్ని తొలగించాలని డిమాండు చేస్తూ కలెక్టర్‌కు, రాజకీయ నాయకులు, అధికారులకు వినతి పత్రాలు […]
BY admin17 Aug 2015 4:54 AM IST
X
admin Updated On: 17 Aug 2015 7:46 AM IST
తమ పంట పొలాలు నాశనమై పోతున్నాయని, తమకు శారీరక సమస్యలు ఎదురవుతున్నాయంటూ నెల్లూరు జిల్లా వింజమూరు మండలం చంద్రపడియ గ్రామస్తులు ఓ కెమికల్ ఫ్యాక్టరీపై దాడి చేశారు. దీన్ని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆందోళనకారులు రెచ్చిపోవడంతో పోలీసులు లాఠీఛార్జి చేయాల్సి వచ్చింది. విష వాయువులు వెలువరించే ఈ ఫ్యాక్టరీని తొలగించాలని వారు డిమాండు చేశారు. గతంలో దీన్ని తొలగించాలని డిమాండు చేస్తూ కలెక్టర్‌కు, రాజకీయ నాయకులు, అధికారులకు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ఏ మాత్రం స్పందన లేకపోవడంతో గ్రామస్తులే నేరుగా రంగంలోకి దిగి ఫ్యాక్టరీపై దాడికి ప్రయత్నించారు. తమకు నూట్రాసిటీ అనే పేరుతో పరిశ్రమ పెడతామని, తమ బతుకులు బాగుచేస్తామని, ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పి తర్వాత ఇక్కడ కెమికల్ ఫ్యాక్టరీ పెట్టారని, ఫ్యాక్టరీ నుంచి వెలువడే రసాయనాల వల్ల తమ పంట పొలాలు ఎందుకు పనికి రాకుండా పోతున్నాయని, చర్మంపై బొబ్బలు వంటి రుగ్మతలు వస్తున్నాయని ఆరోపించారు. దీన్ని తొలగించాలని అనేకసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోక పోవడంతో ఫ్యాక్టరీపై దాడి జరపాల్సి వచ్చిందని వారు అన్నారు. అధికారులు, రాజకీయ నాయకులు ఫ్యాక్టరీ యాజమాన్యానికి వత్తాసు పలకడం వల్లే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఇప్పటికైనా తమ గ్రామం నుంచి ఫ్యాక్టరీ తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని వారు డిమాండు చేస్తున్నారు. పోలీసులు సకాలంలో వచ్చి ఉండకపోతే ఫ్యాక్టరీ మొత్తం నాశనమయ్యేది.
Next Story