Telugu Global
Others

చస్తాం... అనుమతించండి

రాష్ట్రపతికి 25 వేల రైతుల మొర ఎన్నెళ్ళ నుంచో చస్తూ బతుకుతున్నాం… ఈ బతుకు ఇక బతకలేం.. చస్తాం… అనుమతించండి మహాప్రభో… అంటూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన 25 వేల మంది రైతులు రాష్ట్రపతికి మొర పెట్టుకున్నారు. ’17 యేళ్ళ నుంచి మాకు పరిహారం ఇవ్వడంకాని, సహాయపడడం కాని చేయడం లేదు. ఇంకెన్నాళ్ళని ఇలా చస్తూ బతగ్గలం?… అందుకే ఒకేసారి చస్తాం’ అంటూ ఉత్తరప్రదేశ్‌లోని మధుర ప్రాంతానికి చెందిన వీరంతా రాష్ట్రపతికి లేఖ రాశారు. గోకుల్‌ బ్యారేజీ కట్టడానికి […]

చస్తాం... అనుమతించండి
X
రాష్ట్రపతికి 25 వేల రైతుల మొర
ఎన్నెళ్ళ నుంచో చస్తూ బతుకుతున్నాం… ఈ బతుకు ఇక బతకలేం.. చస్తాం… అనుమతించండి మహాప్రభో… అంటూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన 25 వేల మంది రైతులు రాష్ట్రపతికి మొర పెట్టుకున్నారు. ’17 యేళ్ళ నుంచి మాకు పరిహారం ఇవ్వడంకాని, సహాయపడడం కాని చేయడం లేదు. ఇంకెన్నాళ్ళని ఇలా చస్తూ బతగ్గలం?… అందుకే ఒకేసారి చస్తాం’ అంటూ ఉత్తరప్రదేశ్‌లోని మధుర ప్రాంతానికి చెందిన వీరంతా రాష్ట్రపతికి లేఖ రాశారు. గోకుల్‌ బ్యారేజీ కట్టడానికి 700 ఎకరాలు తీసేసుకున్న ప్రభుత్వం తమను ముందుగాని, ఆ తర్వాతగాని ఒక్క మాట కూడా అడగలేదని, అప్పటి నుంచి పరిహారం కోసం పడిగాపులు కాస్తున్నా ఒక్క పైసా విదల్చలేదని మధుర గ్రామస్థులు చెబుతున్నారు. 1988లో గోకుల్‌ బ్యారేజీ గేట్లు పరీక్ష నిమిత్తం మూసేశారు. అప్పుడే తమ భూములన్నీ మునిగిపోయాయి. మొత్తం 25 వేల మంది రైతులు ఇందులో బాధితులు. వీరికి పరిహారం ఇవ్వాలంటే ఎనిమిది కోట్ల రూపాయలు అవసరమవుతాయి. ఈ అంశం పార్లమెంటులో కూడా చర్చకు వచ్చింది. అలాగే అది మరుగున పడిపోయింది. 2014లో ఈ అంశాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ భారతీయ కిసాన్‌ సంఘ్‌ భుజానికెత్తుకుంది. కాని దానికి సరైన స్పందన రాలేదు. ఇపుడు యూపీలో సమాజ్‌వాది పార్టీ సారధ్యంలో అఖిలేష్‌ ప్రభుత్వం పరిపాలన సాగిస్తోంది. కేంద్రంలో భారతీయ జనతాపార్టీ పగ్గాలు చేపట్టింది. బీజేపీకి కూడా ఎంతోకొంత అనుబంధమున్న కిసాన్‌ సంఘ్‌ కూడా బాధితుల అంశాన్ని వదిలి వేయడంతో ఇపుడు వారికి ఆత్మహత్యలు తప్ప మరో శరణ్యం కనిపించడం లేదు. అందుకే భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి లేఖ రాశారు. తామంతా చచ్చిపోతాం… అనుమతించండి అంటూ. దీనికి రాష్ట్రపతి ఎలా స్పందిస్తారో… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాల్సిందే.
First Published:  17 Aug 2015 5:33 AM GMT
Next Story