ఉగ్రదాడిలో పాక్ హోమంత్రి సహా 12 మంది దుర్మరణం
పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు పేట్రేగి పోయారు. పంజాబ్‌లో తీవ్రవాదాన్ని అంతమొందించడానికి ప్రయత్నిస్తుండడంతోపాటు ఆల్‌ఖైదా ఉగ్రవాదులను ఏరివేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న రాష్ట్ర హోంమంత్రి షుజా ఖాన్‌జాదా లక్ష్యంగా ఆయన నివాసగృహంపై ఆత్మాహుతి దాడి చేసారు. ఉగ్రవాదులు చేసిన బాంబు దాడిలో హోంమంత్రి షుజా ఖాన్‌జాదాతోపాటు మరో 12 మంది మృతి చెందారు. వివరాల్లోకి వెళితే… హోంమంత్రి షుజా షాదిఖెల్ గ్రామంలోని ఇంట్లో సమావేశం నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు లోపలకు ప్రవేశించి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. బాంబు దాడి ధాటికి భవనం […]
BY sarvi17 Aug 2015 5:36 AM IST
X
sarvi Updated On: 17 Aug 2015 7:47 AM IST
పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు పేట్రేగి పోయారు. పంజాబ్‌లో తీవ్రవాదాన్ని అంతమొందించడానికి ప్రయత్నిస్తుండడంతోపాటు ఆల్‌ఖైదా ఉగ్రవాదులను ఏరివేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న రాష్ట్ర హోంమంత్రి షుజా ఖాన్‌జాదా లక్ష్యంగా ఆయన నివాసగృహంపై ఆత్మాహుతి దాడి చేసారు. ఉగ్రవాదులు చేసిన బాంబు దాడిలో హోంమంత్రి షుజా ఖాన్‌జాదాతోపాటు మరో 12 మంది మృతి చెందారు. వివరాల్లోకి వెళితే… హోంమంత్రి షుజా షాదిఖెల్ గ్రామంలోని ఇంట్లో సమావేశం నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు లోపలకు ప్రవేశించి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. బాంబు దాడి ధాటికి భవనం కూలిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హోంమంత్రి చికిత్స పొందుతూ మరణించారు. డిఎస్పీ షౌకత్‌షా కూడా ప్రాణాలు కోల్పోయారు.
Next Story