కిరోసిన్‌కూ నగదు బదిలీనే ..
వంటగ్యాస్‌కు నగదు బదిలీ పధకం సక్సెస్ కావడంతో కిరోసిన్‌కు కూడా అదే విధానాన్ని అనుసరించాలని కేంద్రం భావిస్తోంది. కిరోసిన్ సరఫరాలో అక్రమాలను నివారించడానికి నగదు బదిలీనే ఉత్తమమని కేంద్ర సంస్థలు, కేంద్ర వ్యయ నిర్వహణ కమిషన్‌లు కేంద్రానికి స్పష్టం చేశాయి. దీంతో కేంద్రం కిరోసిన్‌కు ఆధార్ నంబరును బ్యాంక్ ఖాతాలకు అనుసంధానం చేసి నగదు బదిలీని చేయాలని భావిస్తోంది. బహిరంగ మార్కెట్లో లీటర్ కిరోసిన్ ధర రూ. 59 ఉండగా, కేంద్రం రూ. 34 రాయితీ భరించి […]
BY sarvi16 Aug 2015 6:45 PM IST
X
sarvi Updated On: 17 Aug 2015 7:58 AM IST
వంటగ్యాస్‌కు నగదు బదిలీ పధకం సక్సెస్ కావడంతో కిరోసిన్‌కు కూడా అదే విధానాన్ని అనుసరించాలని కేంద్రం భావిస్తోంది. కిరోసిన్ సరఫరాలో అక్రమాలను నివారించడానికి నగదు బదిలీనే ఉత్తమమని కేంద్ర సంస్థలు, కేంద్ర వ్యయ నిర్వహణ కమిషన్‌లు కేంద్రానికి స్పష్టం చేశాయి. దీంతో కేంద్రం కిరోసిన్‌కు ఆధార్ నంబరును బ్యాంక్ ఖాతాలకు అనుసంధానం చేసి నగదు బదిలీని చేయాలని భావిస్తోంది. బహిరంగ మార్కెట్లో లీటర్ కిరోసిన్ ధర రూ. 59 ఉండగా, కేంద్రం రూ. 34 రాయితీ భరించి లబ్దిదారుడికి రూ. 15కే అందిస్తోంది. సబ్సిడీ కిరోసిన్‌లో పలు అక్రమాలు జరుగుతున్నాయని గుర్తించిన కేంద్రం ఈ విధానంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది.
Next Story