సంప్రదింపులు తర్వాతే హైకోర్టు విభజన
ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించిన తర్వాత హైకోర్టు విభజనపై కేంద్రానికి నివేదిస్తామని కేంద్ర న్యాయశాఖమంత్రి సదానందగౌడ్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో ఆ అంశంపై ఆయన స్పందించారు. ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించిన తర్వాత హైకోర్టు విభజనపై కేంద్రానికి నివేదిస్తామని, ఇదే విషయాన్ని కోర్టు కూడా ప్రస్తావించిందని ఆయన అన్నారు. హైదరాబాద్‌లోని నల్సార్ లా యూనివర్శిటీలో జరిగిన 13వ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్య […]
BY sarvi16 Aug 2015 6:43 PM IST
X
sarvi Updated On: 17 Aug 2015 7:44 AM IST
ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించిన తర్వాత హైకోర్టు విభజనపై కేంద్రానికి నివేదిస్తామని కేంద్ర న్యాయశాఖమంత్రి సదానందగౌడ్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో ఆ అంశంపై ఆయన స్పందించారు. ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించిన తర్వాత హైకోర్టు విభజనపై కేంద్రానికి నివేదిస్తామని, ఇదే విషయాన్ని కోర్టు కూడా ప్రస్తావించిందని ఆయన అన్నారు. హైదరాబాద్‌లోని నల్సార్ లా యూనివర్శిటీలో జరిగిన 13వ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఏ రాష్ట్ర హైకోర్టు అదే రాష్ట్రంలో ఉండాలన్నది కేంద్ర ఉద్దేశమని అన్నారు. హైకోర్టు కోసం భూమి, స్థలం, సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలదేనని అన్నారు. హైకోర్టు అంశం కోర్టు పరిధిలో ఉన్నందున ఈ విషయంపై ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేనని సదానందగౌడ్ అన్నారు.
Next Story