Telugu Global
Others

బంగారం స్మగ్లింగ్ కు అడ్డాగా శంషాబాద్ ఎయిర్ పోర్టు

శంషాబాద్ ఎయిర్ పోర్టు బంగారం స్మగ్లింగ్ కు అడ్డాగా మారుతోంది. గత కొన్ని రోజులుగా కస్టమ్స్ అధికారులు చేస్తున్న తనిఖీల్లో భారీగా బంగారం బయటపడుతోంది. అధికంగా సంపాదించవచ్చనే ఆశతో కొంతమంది దొడ్డిదారిన తరలించాలని శంషాబాద్ ఎయిర్ పోర్టును అడ్డాగా ఎంచుకున్నారు. తాజాగా సోమవారం ఉదయం కస్టమ్స్ అధికారులు జరిపిన తనిఖీల్లో రెండు కిలోల బంగారం బయపడింది. దీని విలువ యాభై లక్షలుంటుంది. దోహా నుండి వచ్చిన ప్రయాణికుడి సూట్ కేసు అడుగు భాగంలో పెట్టిన బంగారం స్కానర్‌ […]

బంగారం స్మగ్లింగ్ కు అడ్డాగా శంషాబాద్ ఎయిర్ పోర్టు
X

శంషాబాద్ ఎయిర్ పోర్టు బంగారం స్మగ్లింగ్ కు అడ్డాగా మారుతోంది. గత కొన్ని రోజులుగా కస్టమ్స్ అధికారులు చేస్తున్న తనిఖీల్లో భారీగా బంగారం బయటపడుతోంది. అధికంగా సంపాదించవచ్చనే ఆశతో కొంతమంది దొడ్డిదారిన తరలించాలని శంషాబాద్ ఎయిర్ పోర్టును అడ్డాగా ఎంచుకున్నారు. తాజాగా సోమవారం ఉదయం కస్టమ్స్ అధికారులు జరిపిన తనిఖీల్లో రెండు కిలోల బంగారం బయపడింది. దీని విలువ యాభై లక్షలుంటుంది. దోహా నుండి వచ్చిన ప్రయాణికుడి సూట్ కేసు అడుగు భాగంలో పెట్టిన బంగారం స్కానర్‌ ద్వారా వెలుగు చూసింది. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలే షూలో మూడు కిలోల బంగారం పెట్టుకున్న ఒకరు తనిఖీ అధికారులకు పట్టుబడిన సంగతి మరిచిపోక ముందే మళ్ళీ మరో రెండు కేజీల బంగారం దొరికింది. ఈ మధ్య కాలంలో శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం బయటపడుతుండడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందులో అధికారుల హస్తం కూడా ఉండవచ్చుననే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

First Published:  17 Aug 2015 7:18 AM IST
Next Story