ఆమెకు 37...అతనికి 42… అయితే!!!
మనం సంతోషంగా ఉన్నపుడు మన శరీరంలో యాభైశాతానికి మించి అదనపు యాంటీబాడీలు ఉత్పతి అవుతాయట. ఇది ఒక రకమైన ప్రొటీన్. దీన్ని మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ తయారుచేస్తుంది. మన శరీరంలోకి వైరస్, బ్యాక్టీరియా, హానిచేసే రసాయనాలు ప్రవేశించినపుడు రోగనిరోధక వ్యవస్థ అప్రమత్తమవుతుంది. తెల్లరక్తకణాల్లో ఉండే యాంటీబాడీలు ఆయా అనారోగ్యాలమీద పోరాటం చేసి అంతం చేస్తాయి. సంతోషం సగం బలం అనేమాటకి నిజమైన నిర్వచనం ఇదే అనవచ్చు. సంతోషం గురించి మరికొన్ని ఆశ్చర్యకరమైన, అద్భుతమైన నిజాలు- -వారానికి మూడుసార్లు రోజుకి ఇరవై నిముషాల చొప్పున వ్యాయామం […]
మనం సంతోషంగా ఉన్నపుడు మన శరీరంలో యాభైశాతానికి మించి అదనపు యాంటీబాడీలు ఉత్పతి అవుతాయట. ఇది ఒక రకమైన ప్రొటీన్. దీన్ని మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ తయారుచేస్తుంది. మన శరీరంలోకి వైరస్, బ్యాక్టీరియా, హానిచేసే రసాయనాలు ప్రవేశించినపుడు రోగనిరోధక వ్యవస్థ అప్రమత్తమవుతుంది. తెల్లరక్తకణాల్లో ఉండే యాంటీబాడీలు ఆయా అనారోగ్యాలమీద పోరాటం చేసి అంతం చేస్తాయి. సంతోషం సగం బలం అనేమాటకి నిజమైన నిర్వచనం ఇదే అనవచ్చు. సంతోషం గురించి మరికొన్ని ఆశ్చర్యకరమైన, అద్భుతమైన నిజాలు-
-వారానికి మూడుసార్లు రోజుకి ఇరవై నిముషాల చొప్పున వ్యాయామం చేస్తుంటే ఆరునెలల్లో పదిశాతం హ్యాపీనెస్ ఇరవై శాతానికి పెరుగుతుందట.
-2005లో అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రవెన్షన్ వారు నిర్వహించిన ఒక సర్వేలో 20-24 సంవత్పరాల మధ్య వయసున్నవారు నెలకు 3.4 రోజులు విషాదంలో ఉంటున్నారట. అదే 65 నుండి 74 సంవత్సరాల మధ్య వయసున్నవారు నెలకు 2.3 రోజులు మాత్రమే బాధాకరమైన ఫీలింగ్స్ ని అనుభవిస్తున్నారని తేలింది.
-హ్యాపీ పీపుల్, సంతోషంగా ఉండలేని వారికంటే ఎక్కువగా డబ్బు సంపాదిస్తున్నారు.
-ఆడవారు జీవితంలో ఆనందంగా ఉండలేని వయసు 37 సంవత్సరాలకు అటుఇటుగా.అదే మగవారయితే 42 సంవత్సరాల వయసులో ఆనందంగా ఉండలేని స్థితిలో ఉంటున్నారు.
-డ్యాన్స్ చేసేవారు ఎక్కువ ఆనందంగా ఉంటారు.
-కనీస అవసరాలు, సౌకర్యాలు తీరిన తరువాత డబ్బు అదనంగా ఎంత ఉన్నా అది ఆనందంమీద ప్రభావాన్ని చూపదు.
-ఒంటరిగా జీవించేవారికంటే అనుబంధాలకు విలువనిచ్చేవారు ఆనందంగా ఉంటున్నారు. వారే అనుబంధాలను నిలబెట్టుకుంటున్నారు కూడా.
-ఆనందంగా ఉన్నపుడు, ఒత్తిడిలో ఉన్నపుడు మన శరీరం నుండి వచ్చే వాసన ఒకేలా ఉండదు, మారిపోతుందట.
-చిన్నతనంలో మనం పిల్లలను ఎంతగా దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుంటే పెద్దయ్యాక వారు అంత సంతోషంగా ఉండగలుగుతారు.
-మన పెద్దల జీన్స్, పెంపకం ఇవి మనలో సంతోషంగా ఉండే గుణానికి యాభై శాతం బాధ్యత వహిస్తాయి.
-మన చుట్టూ ఉన్న బయటి విషయాలనుండి మనకు దక్కే ఆనందం కేవలం పదిశాతం మాత్రమే.
-మనం జీవితాన్ని చూసే విధానం, చేసే పని, స్నేహితులు, నివసిస్తున్న సమాజం ఇవన్నీ కలిసి మన ఆనందంలో 40 శాతాన్ని ప్రభావితం చేస్తాయి.
-ఇప్పటికిప్పుడు ఇన్‌స్టంట్ ఆనందం కావాలంటే ఇతరులపట్ల దయగా స్నేహంగా ఉండటం, సహాయం చేయడం, మనకు సహాయం చేసినవారికి కృతజ్ఞతలు చెప్పడం లాంటి పనులు వారానికి ఐదు చేయాలి. ఇక దీర్ఘకాలం పాటు సంతోషంగా ఉండాలంటే..మనలోని బలం, బలహీనతలు తెలుసుకుని ఇతరులతో కలిసిమెలసి పనిచేయడం అలవాటు చేసుకోవాలి.