100 నగరాల్లో ఎల్‌ఈడీ వెలుగులు
దేశంలోని 100 నగరాల్లో వీధులను ఎల్‌ఈడీ వెలుగులు జిగేల్‌మనిపించనున్నాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన విద్యుత్ పొదుపు, సంరక్షణ విధానాన్ని యథాతథంగా అమలు చేయాలని భావిస్తున్నట్లు కేంద్ర విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ముఖ్యంగా విశాఖపట్నం ఎల్‌ఈడీ స్ట్రీట్ లైట్ ప్రాజెక్టు నమూనాను ఇతర నగరాలకు విస్తరింపజేయాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎల్‌ఈడీ స్ట్రీట్ లైటింగ్‌పై విశాఖలో అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్న నేపథ్యంలో కేంద్రం బృందం నగరంలో ఈ ప్రాజెక్టును పరిశీలించింది.
BY Pragnadhar Reddy16 Aug 2015 1:05 PM GMT
Pragnadhar Reddy Updated On: 17 Aug 2015 2:19 AM GMT

Next Story