Telugu Global
Cinema & Entertainment

మరో రీమేక్ లో అల్లరోడు

రీసెంట్ గా జేమ్స్ బాండ్ సినిమా చేశాడు అల్లరి నరేష్. కానీ ఆ సినిమా కూడా అంతగా ఆడలేదు. ప్రస్తుతం మంచు అల్లుడు కంచు అనే మరో సినిమా చేస్తున్నాడు. అయితే ఎన్ని సినిమాలు చేస్తున్నప్పటికీ అల్లరి నరేష్ కు మాత్రం తృప్తి కలగడం లేదు. మరీ ముఖ్యంగా సుడిగాడి లాంటి హిట్ తగలడం లేదు. దీంతో మరోసారి సుడిగాడి ఫార్ములానే ఫాలో అవ్వాలని నిర్ణయించుకున్నాడు. రీమేక్ సినిమాగా సుడిగాడు వచ్చింది. దీంతో మరోసారి రీమేక్ బాట […]

మరో రీమేక్ లో అల్లరోడు
X
రీసెంట్ గా జేమ్స్ బాండ్ సినిమా చేశాడు అల్లరి నరేష్. కానీ ఆ సినిమా కూడా అంతగా ఆడలేదు. ప్రస్తుతం మంచు అల్లుడు కంచు అనే మరో సినిమా చేస్తున్నాడు. అయితే ఎన్ని సినిమాలు చేస్తున్నప్పటికీ అల్లరి నరేష్ కు మాత్రం తృప్తి కలగడం లేదు. మరీ ముఖ్యంగా సుడిగాడి లాంటి హిట్ తగలడం లేదు. దీంతో మరోసారి సుడిగాడి ఫార్ములానే ఫాలో అవ్వాలని నిర్ణయించుకున్నాడు. రీమేక్ సినిమాగా సుడిగాడు వచ్చింది. దీంతో మరోసారి రీమేక్ బాట పట్టాడు అల్లరోడు. కన్నడలో హిట్టయిన విక్టరీ సినిమాను రీమేక్ చేయాలని నిర్ణయించాడు. అల్లరి నరేష్ తో గతంలో సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం సినిమా తీసిన ఈశ్వర్ రెడ్డి.. ఈ రీమేక్ సినిమాకు దర్శకుడు. ప్రస్తుతం అల్లరినరేష్ చేస్తున్న సినిమా కంప్లీట్ అయిన వెంటనే ఈ రీమేక్ మూవీ పట్టాలపైకి వస్తుందంటున్నారు. ఈ సినిమాతో సుడిగాడి రేంజ్ లో మరో సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు అల్లరినరేష్.
First Published:  17 Aug 2015 12:34 AM IST
Next Story