విభజనతో మూలుగుతున్న రూ. 2వేల కోట్లు
పెద్ద ఎత్తున బ్యాంకుల్లో నిధులు మూలుగుతున్నా వాటిని వాడుకోలేని దుస్థితి ఏర్పడిందని తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ నిట్టూర్పులు విడుస్తోంది. పదో షెడ్యూలులో పేర్కొన్న ప్రభుత్వరంగ సంస్థలు, కార్పోరేషన్లలో రూ. 2000 కోట్లకు పైగా నిధులు నిల్వ ఉన్నాయి. ఫిక్స్ డ్ డిపాజిట్ల రూపంలో ఇవి బ్యాంకుల్లో భద్రంగా ఉన్నాయి. అయితే తెలంగాణ, ఏపీల మధ్య విభజన ప్రక్రియ వివాదం నెలకొనడంతో ఈ నిధులను సొంతసంస్థలు ఉపయోగించుకోలేక పోతున్నాయి. ఆర్థిక పరిస్థితులు అధ్వానంగా ఉన్నా, విభజన ప్రక్రియ పూర్తయ్యే […]
BY sarvi16 Aug 2015 6:46 PM IST
X
sarvi Updated On: 17 Aug 2015 8:04 AM IST
పెద్ద ఎత్తున బ్యాంకుల్లో నిధులు మూలుగుతున్నా వాటిని వాడుకోలేని దుస్థితి ఏర్పడిందని తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ నిట్టూర్పులు విడుస్తోంది. పదో షెడ్యూలులో పేర్కొన్న ప్రభుత్వరంగ సంస్థలు, కార్పోరేషన్లలో రూ. 2000 కోట్లకు పైగా నిధులు నిల్వ ఉన్నాయి. ఫిక్స్ డ్ డిపాజిట్ల రూపంలో ఇవి బ్యాంకుల్లో భద్రంగా ఉన్నాయి. అయితే తెలంగాణ, ఏపీల మధ్య విభజన ప్రక్రియ వివాదం నెలకొనడంతో ఈ నిధులను సొంతసంస్థలు ఉపయోగించుకోలేక పోతున్నాయి. ఆర్థిక పరిస్థితులు అధ్వానంగా ఉన్నా, విభజన ప్రక్రియ పూర్తయ్యే వరకు రుణాలు తెచ్చుకోవడం మరో గత్యంతరం లేదని ఆర్థికశాఖ అధికారులు వాపోతున్నారు.
Next Story