విదేశాల్లోనూ... 108 కుయ్‌కుయ్
దివంగత మాజీ ముఖ్యమంత్రి డా.రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన కుయ్‌కుయ్‌కుయ్ … 108 సేవలు ఇకపై విదేశాలకూ విస్తరించనున్నాయి. ఈ ఏడాది చివర్లో శ్రీలంకలో 108 సేవలను ప్రారంభించనున్నట్లు జీవీకే ఈఎంఆర్ఐ చైర్మన్ జీవీరెడ్డి తెలిపారు. ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరిందని ఆయన చెప్పారు. ఇండోనేషియా, థాయ్‌లాండ్‌తో పాటు దక్షిణాసియా దేశాలకు కూడా 108 సేవలు విస్తరిస్తామని ఆయన చెప్పారు. 108 అంబులెన్స్ సేవలు ప్రారంభమై 10 సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 2005లో […]
BY Pragnadhar Reddy16 Aug 2015 9:18 PM GMT
X
Pragnadhar Reddy Updated On: 17 Aug 2015 2:17 AM GMT
దివంగత మాజీ ముఖ్యమంత్రి డా.రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన కుయ్‌కుయ్‌కుయ్ … 108 సేవలు ఇకపై విదేశాలకూ విస్తరించనున్నాయి. ఈ ఏడాది చివర్లో శ్రీలంకలో 108 సేవలను ప్రారంభించనున్నట్లు జీవీకే ఈఎంఆర్ఐ చైర్మన్ జీవీరెడ్డి తెలిపారు. ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరిందని ఆయన చెప్పారు. ఇండోనేషియా, థాయ్‌లాండ్‌తో పాటు దక్షిణాసియా దేశాలకు కూడా 108 సేవలు విస్తరిస్తామని ఆయన చెప్పారు. 108 అంబులెన్స్ సేవలు ప్రారంభమై 10 సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 2005లో 14 అంబులెన్స్ వాహనాలు, 70 మంది సిబ్బందితో ప్రారంభంకాగా, ప్రస్తుతం పదివేల వాహనాలు,42వేల మంది సిబ్బందితో సేవలందిస్తోంది.
Next Story