Telugu Global
Others

నవీద్‌ మానసిక స్థితిపై గందరగోళం!

భారత జవాన్లపై దాడి చేసి సజీవంగా పట్టుబడిన పాక్‌ ఉగ్రవాది మహ్మద్‌ నవెద్‌ను నేషనల్‌ ఇన్వెస్టిగేటివ్‌ ఏజన్నీ (ఎన్‌ఐఏ) పక్కా విచారిస్తోంది. జమ్ము కాశ్మీర్‌లోని ఉదంపూర్‌ జిల్లా సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతం కాగా, ఉస్మాన్‌ఖాన్‌ అనే ఈ నవీద్‌ను భద్రతా దళాలు సజీవంగా పట్టుకున్నాయి. అదుపులోకి తీసుకున్న తర్వాత అతన్ని విచారిస్తున్న పోలీసులకు నవీద్‌ ఇచ్చే సమాధానాలు తిక్క పుట్టిస్తున్నాయి. అతను ఇచ్చే సమాధానాలు అందరినీ నివ్వెరపరుస్తున్నాయి. 20 ఏళ్ల ఉస్మాన్‌ఖాన్‌ ఒకే […]

నవీద్‌ మానసిక స్థితిపై గందరగోళం!
X
భారత జవాన్లపై దాడి చేసి సజీవంగా పట్టుబడిన పాక్‌ ఉగ్రవాది మహ్మద్‌ నవెద్‌ను నేషనల్‌ ఇన్వెస్టిగేటివ్‌ ఏజన్నీ (ఎన్‌ఐఏ) పక్కా విచారిస్తోంది. జమ్ము కాశ్మీర్‌లోని ఉదంపూర్‌ జిల్లా సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతం కాగా, ఉస్మాన్‌ఖాన్‌ అనే ఈ నవీద్‌ను భద్రతా దళాలు సజీవంగా పట్టుకున్నాయి. అదుపులోకి తీసుకున్న తర్వాత అతన్ని విచారిస్తున్న పోలీసులకు నవీద్‌ ఇచ్చే సమాధానాలు తిక్క పుట్టిస్తున్నాయి. అతను ఇచ్చే సమాధానాలు అందరినీ నివ్వెరపరుస్తున్నాయి. 20 ఏళ్ల ఉస్మాన్‌ఖాన్‌ ఒకే ప్రశ్నకు పలు రకాలుగా సమాధానాలు ఇవ్వడం ఎన్‌ఐఏను కూడా విస్మయపరుస్తున్నాయి. మరోవైపు అతని మానసిక స్థితిపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతని ప్రవర్తన, బాడీ లాంగ్వేజ్‌ కూడా అందుకు బలం చేకూరుస్తున్నాయి. లష్కరే తోయిబాకు చెందిన టెర్రరిస్ట్ అని చెప్పుకుంటున్న ఈ తీవ్రవాది తాను కావాలనే భద్రతా దళాలను, ఎన్‌ఐఏ పోలీసులను కన్‌ప్యూజ్‌ చేస్తున్నాడా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఉస్మాన్‌ఖాన్‌ వ్యవహారశైలిని అంచనా వేయడానికి, అతని మానసిక స్థితి పెద్దగా ఉపకరించడం లేదనే చెప్పాలి.
వివిధ అంశాలపై నవీద్‌ ఇప్పటివరకు ఇచ్చిన సమాచారం అటు పోలీసులకు, ఇటు మీడియాకు, ఎప్పటికప్పుడు విషయాల్ని తెలుసుకుంటున్న ప్రజలకు గందరగోళాన్ని మిగిలిస్తున్నాయి. తొలిసారిగా భద్రతా దళాలకు పేరు చెప్పడంలోనే ఉస్మాన్‌ కన్‌ప్యూజన్‌ సృష్టించాడు. భద్రతా దళాలకు పట్టుబడిన ఉస్మాన్‌ను పేరేంటని ప్రశ్నిస్తే మూడు పేర్లు చెప్పుకొచ్చాడు. తొలిసారిగా ఖాసీంఖాన్‌ అని, రెండోసారి ఉస్మాన్‌ అని, మూడోసారి మహ్మద్‌ నవెద్‌ అని తెలిపాడు. ఇక అతని బ్యాడీ లాంగ్వేజ్‌ను పరిశీలిస్తే నేరం చేసినప్పటికీ అతనిలో ఆ భావం కనిపించకుండా దాస్తున్నాడు. అప్పుడప్పుడూ నవ్వడం, ఎలాంటి పశ్చాత్తాపం కనిపించకపోవడం. చొక్కా పై బటన్‌ పెట్టుకోకుండా వదిలేయడం… ఇవన్నీ గమనిస్తే ఇతను నేరగాడా అనే అనుమానం కలుగుతుంది. కాలేజీ జీవితంలో బ్యాక్‌ బెంచ్‌లో కూర్చుండే అతను… చదువుకోకుండానే పరీక్షలకు వెళ్లేవాడని తెలిసింది. ఇక అతని హావభావాలు చూసిన వారికి అతనో అమాయకుడనే భావన కలుగుతుంది. పాకిస్తాన్‌ నుండి వచ్చావా లేదా? అని అడిగిన ప్రశ్నకు మొహంలో ఎలాంటి స్పందనా లేదు. ఇలాంటి ప్రశ్నలకు విసుగు చెందుతూనే కొద్దిసేపటి తర్వాత 12 రోజులకు ముందు వచ్చినట్టు బదులిచ్చాడు. మొత్తం ఎంత మంది టెర్రరిస్టులు? అని విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా… నవ్వుతూ ఇద్దరమే అంటూ జవాబిచ్చాడు. ఉన్నట్లుండి ఇద్దరం కాదని, ఇంకా ఉన్నారని తెలిపాడు. ఎందుకు ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడతారు? అని అడిగితే… నేరుగా ముఖం పైకెత్తి చూసిన ఉస్మాన్‌ ‘వదిలేయండి’ అంటూ తేలిగ్గా అనేశాడు. మరి మీకు డబ్బులెలా వస్తాయి? ప్రశ్నకు సమాధానంగా నవ్వుతూ మేం చేస్తున్నది అల్లా పని అంటూ ఆయనే సమకూరుస్తాడన్నాడు. జీవితం మీద భయం లేదా అంటే… ఉస్మాన్‌ మరోసారి నవ్వేసి.. చావాల్సి వుంటే చనిపోతామంటూ తేలికపాటి సమాధానమిచ్చేశాడు.
First Published:  16 Aug 2015 2:30 AM IST
Next Story