వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కి అవమానం
అధికారుల దృష్టంతా అధికారపార్టీపైనే ఉంటుంది. అధికార పార్టీ నాయకులకు, ప్రజాప్రతినిధులకు వారు కొమ్ముకాస్తుంటారు. ప్రతిపక్ష పార్టీలంటే వారికి చిన్నచూపు. కొందరు నిజాయితీ గలిగిన అధికారులు మాత్రమే ఇందుకు మినహాయింపు. తూర్పుగోదావరి ఏజెన్సీ ఐటీడీఏ అధికారులు వైఎస్ఆర్‌కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని అవమానించి తాము ఎవరికీ తీసిపోమని నిరూపించుకున్నారు. అధికారుల వైఖరితో మనస్తాపం చెందిన ఆ ఎమ్మెల్యే కంటతడిపెట్టారు. ఐటిడిఎ అధికారులు ప్రొటోకాల్ పాటించకుండా తనను అవమానించారంటూ తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్‌కాంగ్రెస్‌కి చెందిన రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి కంటతడి […]
BY Pragnadhar Reddy16 Aug 2015 2:30 AM IST
X
Pragnadhar Reddy Updated On: 16 Aug 2015 2:30 AM IST
అధికారుల దృష్టంతా అధికారపార్టీపైనే ఉంటుంది. అధికార పార్టీ నాయకులకు, ప్రజాప్రతినిధులకు వారు కొమ్ముకాస్తుంటారు. ప్రతిపక్ష పార్టీలంటే వారికి చిన్నచూపు. కొందరు నిజాయితీ గలిగిన అధికారులు మాత్రమే ఇందుకు మినహాయింపు. తూర్పుగోదావరి ఏజెన్సీ ఐటీడీఏ అధికారులు వైఎస్ఆర్‌కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని అవమానించి తాము ఎవరికీ తీసిపోమని నిరూపించుకున్నారు. అధికారుల వైఖరితో మనస్తాపం చెందిన ఆ ఎమ్మెల్యే కంటతడిపెట్టారు. ఐటిడిఎ అధికారులు ప్రొటోకాల్ పాటించకుండా తనను అవమానించారంటూ తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్‌కాంగ్రెస్‌కి చెందిన రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి కంటతడి పెట్టుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రంపచోడవరం జూనియర్ కాలేజీ ఆవరణలో జాతీయ పతాకావిష్కరణకు ఎంఎల్‌ఎతోపాటు ఎంపిపి, జడ్‌పిటిసి, ఎంపిటిసి సభ్యులను అధికారులు ఆహ్వానించారు. పతాకావిష్కరణ ఐటిడిఎ పిఒతో చేయించి, తనను అవమానించారని రాజేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. తాను ప్రతిపక్ష పార్టీలోనూ, ఎస్‌టి మహిళను కావడంతో ఐటిడిఎ అధికారులు చులకనగా చూస్తున్నారని అన్నారు. ఈ విషయంపై గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తామని, అసెంబ్లీలో కూడా ప్రస్తావిస్తామని ఆమె తెలిపారు. ఏమైనా అధికారులు ఇలా వ్యవహరించడం సరికాదని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు.
Next Story