అబూదబీ మసీదులో మోడీ అనుకూల నినాదాలు
ప్రపంచంలోనే మూడో అతి పెద్ద మసీదైన షేక్ జాయద్ మసీదులో భారత ప్రధాని నరేంద్ర మోడీకి అద్భుతమైన స్వాగతం లభించింది. మసీదును ఆయన సందర్శించి దాని అద్భుత నిర్మాణాన్ని పరిశీలించారు. 30 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ మసీదులో స్థానిక రాజ వంశీయులతో కలిసి కలియ తిరిగారు. మోడీ మసీదును సందర్శిస్తున్న సమయంలో అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మోడీ అనుకూల నినాదాలతో హోరెత్తించారు. ప్రిన్స్ నహ్యాన్ తదితర నాయకులతో కలిసి మసీదు వద్ద మోడీ సెల్ఫీ కూడా […]
ప్రపంచంలోనే మూడో అతి పెద్ద మసీదైన షేక్ జాయద్ మసీదులో భారత ప్రధాని నరేంద్ర మోడీకి అద్భుతమైన స్వాగతం లభించింది. మసీదును ఆయన సందర్శించి దాని అద్భుత నిర్మాణాన్ని పరిశీలించారు. 30 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ మసీదులో స్థానిక రాజ వంశీయులతో కలిసి కలియ తిరిగారు. మోడీ మసీదును సందర్శిస్తున్న సమయంలో అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మోడీ అనుకూల నినాదాలతో హోరెత్తించారు. ప్రిన్స్ నహ్యాన్ తదితర నాయకులతో కలిసి మసీదు వద్ద మోడీ సెల్ఫీ కూడా దిగారు. మోడీ మసీదు సందర్శన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అంతకుముందు రెండు రోజుల పర్యటనలో భాగంగా అబూదబీ చేరుకున్నభారత ప్రధాని నరేంద్ర మోడీకి అబూదబీలో ఘన స్వాగతం లభించింది. మోదీకి ప్రిన్స్ నహ్యాన్ ఐదుగురు సోదరులు రెడ్ కార్పెట్ వెల్‌కం చెప్పారు. ఇక్కడే మోడీ సైనిక వందనం స్వీకరించారు. పర్యటనలో భాగంగా మోడీ ఈరోజు అబూదబీలోని షేక్ జాయెద్ గ్రాండ్ మసీదును సందర్శించనున్నారు. అక్కడ ఆయన భారత కార్మికుల శిబిరాన్ని సందర్శించి వారితో ముచ్చటించనున్నారు. వారి సాధకబాధకాలు తెలుసుకోనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ యూఏఈతో వర్తక, వాణిజ్య అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం చర్చల్లో కీలక అంశం కానుంది.