ఏపీ కేబినెట్‌లో మార్పులకు బీజేపీ ఎదురుచూపు?!
ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి త్వరలో జరగనున్న మార్పులను బీజేపీ తనదైన శైలిలో ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఏపీ కేబినెట్‌లో ఉన్న దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాల్‌రావుని ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడిగా నియమించే ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. మాణిక్యాల్‌రావు స్థానంలో పార్టీకి చెందిన విశాఖ జిల్లా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజును మంత్రిమండలిలోకి పంపించాలని భారతీయ జనతాపార్టీ యోచిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇపుడు మాణిక్యాలరావు నిర్వహిస్తున్న శాఖనే విష్ణుకుమార్ రాజుకి ఇచ్చి మంత్రిగా బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల తెలుగుదేశం […]
BY sarvi16 Aug 2015 3:30 AM IST
X
sarvi Updated On: 16 Aug 2015 4:07 AM IST
ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి త్వరలో జరగనున్న మార్పులను బీజేపీ తనదైన శైలిలో ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఏపీ కేబినెట్‌లో ఉన్న దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాల్‌రావుని ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడిగా నియమించే ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. మాణిక్యాల్‌రావు స్థానంలో పార్టీకి చెందిన విశాఖ జిల్లా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజును మంత్రిమండలిలోకి పంపించాలని భారతీయ జనతాపార్టీ యోచిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇపుడు మాణిక్యాలరావు నిర్వహిస్తున్న శాఖనే విష్ణుకుమార్ రాజుకి ఇచ్చి మంత్రిగా బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల తెలుగుదేశం పార్టీకి కూడా పెద్ద ఇబ్బంది ఉండదని పార్టీ పెద్ద వెంకయ్యనాయుడు యోచిస్తున్నారని తెలుస్తోంది. మాణిక్యాల రావు మీద తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు సదభిప్రాయం లేదంటున్నారు. పుష్కరాల్లో కూడా ఆయన పాత్రను పరిమితం చేయడం, దానికి ఆయన మంత్రివర్గం సమావేశంలోనే బాబును నిలదీయడం జరిగింది. అప్పటి నుంచి చంద్రబాబు కూడా ఆయన్ను ఎలా పదవి నుంచి తప్పించాలా అని యోచిస్తున్నారు. బీజేపీయే స్వయంగా మాణిక్యాలరావు స్థానంలో మరొకరిని తీసుకోవాలని కోరితే అది తెలుగుదేశం పార్టీకి లాభిస్తుంది. ఇదిలావుండగా మాణిక్యాల్‌రావుని ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడిగా నియమించే ఆలోచనలో బీజేపీ కేంద్రనాయకులు వున్నట్లు తెలుస్తొంది. ఈ వ్యవహారంతా ముఖ్యంగా వెంకయ్యనాయుడి ఆధ్వర్యంలో జరగుతున్నట్లు సమాచారం.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసుకోవాలని భారతీయ జనతాపార్టీ భావిస్తోంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో ఉండడం వల్ల ఆంధ్రలో తమకంటూ ప్రత్యేక ఉనికి లేకుండా పోతోందని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. అందుకే పార్టీని ఎలా పునర్నిర్మించాలని ఆలోచన చేస్తున్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో బీసీల తర్వాత కాపు సామాజిక వర్గమే ప్రధానమైంది. దీన్ని తమ చెప్పు చేతల్లో ఉంచుకుంటే పార్టీకి ఎంతో మేలు జరుగుతుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే మంత్రి మాణిక్యాలరావును ఆ పదవి నుంచి తొలగించి ఆయనకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. తొలిదశలో కాంగ్రెస్ నుంచి బీజేపీ తీర్థం పుచ్చుకున్న కాపు నాయకుడు కన్నా లక్ష్మీ నారాయణకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పాలని యోచించినప్పటికీ ఆయనకు బీజేపీ పునాదులు లేకపోవడంతోనే ఆ నిర్ణయాన్ని మార్చుకున్నట్టు తెలుస్తోంది. మాణిక్యాలరావు స్థానంలో విష్ణురాజును తీసుకోవడం ద్వారా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అనుయాయులకు కొంత ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుందని కూడా చెబుతున్నారు.
Next Story