Telugu Global
Others

ఏపీ ఎక్స్‌ప్రెస్‌పై ‘ఈస్ట్‌కోస్ట్‌’ పెత్తనం!

ఏపీ ఎక్స్‌ప్రెస్‌పై‘ఈస్ట్‌కోస్ట్‌’రైల్వే డివిజన్‌ పెత్తనం చేస్తోంది. వివాదం మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి. మొన్న బుధవారం ప్రారంభమైన ఏపీ ఎక్స్‌ప్రెస్‌కు తొలిసారి గార్డుగా విజయవాడకు చెందిన ఉద్యోగిని నియమించారు. విజయవాడ రైల్వే డివిజన్‌ గార్డును తొలగించి తమ గార్డును నియమించుకుని ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే డివిజన్‌ తన పంతం నెగ్గించుకుంది. రైలు ప్రారంభోత్సవం సందర్భంగా విజయవాడ డివిజన్‌ నుంచి ఈ రైలు నడపటానికి రైలు డ్రైవర్లు, గార్డులు విజయవాడ నుంచి విశాఖపట్నానికి వెళ్లారు. అయితే ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే అధికారులు […]

ఏపీ ఎక్స్‌ప్రెస్‌పై ‘ఈస్ట్‌కోస్ట్‌’ పెత్తనం!
X
ఏపీ ఎక్స్‌ప్రెస్‌పై‘ఈస్ట్‌కోస్ట్‌’రైల్వే డివిజన్‌ పెత్తనం చేస్తోంది. వివాదం మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి. మొన్న బుధవారం ప్రారంభమైన ఏపీ ఎక్స్‌ప్రెస్‌కు తొలిసారి గార్డుగా విజయవాడకు చెందిన ఉద్యోగిని నియమించారు. విజయవాడ రైల్వే డివిజన్‌ గార్డును తొలగించి తమ గార్డును నియమించుకుని ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే డివిజన్‌ తన పంతం నెగ్గించుకుంది. రైలు ప్రారంభోత్సవం సందర్భంగా విజయవాడ డివిజన్‌ నుంచి ఈ రైలు నడపటానికి రైలు డ్రైవర్లు, గార్డులు విజయవాడ నుంచి విశాఖపట్నానికి వెళ్లారు. అయితే ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే అధికారులు అక్కడ కూడా ఇది కుదరనివ్వలేదు. డ్రైవర్లను కూడా ఆ డివిజన్‌ వ్యక్తులనే నియమించింది. దీనిపై ప్రారంభోత్సవం రోజే ఈస్ట్‌కోస్ట్‌, విజయవాడ డివిజన్ల అధికారుల మధ్య వివాదం రేగింది. దక్షిణ మధ్య రైల్వే చీఫ్‌ ఆపరేటింగ్‌ మేనేజర్‌ జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని భావించినా ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే అధికారులు ఖాతరు చేయలేదు. బుధవారం ప్రారంభమైన ఈ రైలుకు ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే గార్డు విధులు నిర్వహించారు. ఏపీ ఎక్స్‌ప్రెస్‌ పేరుతో నడుస్తున్న ఈ రైలుకు ఈస్ట్‌కోస్ట్‌ రైల్వేకి ఎలాంటి సంబంధం లేకున్నా.. వారు పెత్తనం చెలాయించడంపై విజయవాడ రైల్వే డివిజన్‌ అధికారులు మండిపడుతున్నారు. ఇకముందు విజయవాడ వారినే గార్డులుగా, డ్రైవర్లుగా నియమించాలని విజయవాడ డివిజన్‌ భావిస్తోంది. అయితే ఈస్ట్‌కోస్ట్‌ డివిజన్‌ నుంచి రైలు ప్రారంభం అవుతున్నందున ఇదెంతవరకు సాధ్యమవుతుందో చూడాలి. అప్పటికీ పరిస్థితిలో మార్పు లేకుంటే రైలు విజయవాడ డివిజన్‌ పరిధిలోకి రాగానే ఆ గార్డును తొలగించి తమ గార్డును నియమిస్తామని ఎంప్లాయిస్‌ సంఘం సభ్యులు అంటున్నారు. సమస్య పరిష్కారం ఎలా అవుతుందో వేచి చూడాల్సిందే!
First Published:  16 Aug 2015 6:30 AM IST
Next Story