Telugu Global
Others

ఇక బాబు వాయిస్ కోసం ఏసీబీ అడుగులు..

ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ కీల‌క అడుగు వేయ‌బోతోంది. ఈ కేసులో ఏసీబీ స్వాధీనం చేసుకున్న వీడియోలు, ఆడియోలు నిజ‌మైన‌వేని ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. మొద‌టి నుంచి ఏపీ ప్ర‌భుత్వం వాదిస్తోన్న‌ట్లుగా అందులో ఎలాంటి క‌ట్‌, పేస్ట్‌లు లేవ‌ని, మార్ఫింగ్ జ‌ర‌గ‌లేద‌ని తేల‌డంతో ఏసీబీ ఇక త‌దుప‌రి చ‌ర్య‌ల‌పై దృష్టి సారించింది. నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌స‌న్‌కు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రూ.50 ల‌క్ష‌ల లంచం ఇస్తూ ప‌ట్టుబ‌డటంతో జైలు పాలైన సంగ‌తి […]

ఇక బాబు వాయిస్ కోసం ఏసీబీ అడుగులు..
X

ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ కీల‌క అడుగు వేయ‌బోతోంది. ఈ కేసులో ఏసీబీ స్వాధీనం చేసుకున్న వీడియోలు, ఆడియోలు నిజ‌మైన‌వేని ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. మొద‌టి నుంచి ఏపీ ప్ర‌భుత్వం వాదిస్తోన్న‌ట్లుగా అందులో ఎలాంటి క‌ట్‌, పేస్ట్‌లు లేవ‌ని, మార్ఫింగ్ జ‌ర‌గ‌లేద‌ని తేల‌డంతో ఏసీబీ ఇక త‌దుప‌రి చ‌ర్య‌ల‌పై దృష్టి సారించింది. నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌స‌న్‌కు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రూ.50 ల‌క్ష‌ల లంచం ఇస్తూ ప‌ట్టుబ‌డటంతో జైలు పాలైన సంగ‌తి తెలిసిందే. మ‌రో వారం తేడాతో వెలువ‌డ్డ ఆడియోలో ఏపీ సీఎం చంద్ర‌బాబు గొంతు ఉండ‌టం జాతీయ‌స్థాయిలో క‌ల‌క‌లం రేపింది. దీంతో చంద్ర‌బాబు ఆ గొంతు త‌న‌ది కాద‌ని వాదిస్తున్నారు. తాజాగా ఎఫ్ ఎస్ ఎల్ నివేదిక‌తో ఆయ‌న గొంతులో ప‌చ్చి వెల‌క్కాయ ప‌డ్డ‌ట్లైంది. వాయిస్ శాంపిళ్ల సేక‌ర‌ణ కోసం ఏసీబీ ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టింది. ఇప్ప‌టికే ఈ కేసులో కీల‌కంగా ఉన్న ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంక‌ట వీర‌య్య‌ల వాయిస్‌ల శాంపిళ్ల కోసం అసెంబ్లీ నుంచి వారు మాట్లాడిన రికార్డులు తెప్పించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు చంద్ర‌బాబును వాయిస్ శాంపిల్ అడిగినా.. ఇవ్వ‌ర‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం. అందుకే అసెంబ్లీ నుంచి తెప్పించుకునే దిశ‌గా ఏసీబీ పావులు క‌దుపుతోంది. దీంతో బాబు అండ్ కో శిబిరంలో గుబులు రేగుతోంది. ఇక బాబు పాపం పండే రోజు ద‌గ్గ‌ర‌లోనే ఉంద‌ని టీఆర్ ఎస్ నేత‌లు వ్యాఖ్యానిస్తున్నారు.

First Published:  16 Aug 2015 4:42 AM IST
Next Story