Telugu Global
NEWS

హైదరాబాద్‌లో ఆరుగురు హుజి ఉగ్రవాదుల అరెస్ట్

ఒకరిది పాక్‌.., మరొకరిది మయన్మార్‌.., ఇద్దరిది బంగ్లాదేశ్‌ నిషేధిత ఉగ్రవాద సంస్థ హర్కత్‌ ఉల్‌ జీహాద్‌ అల్‌ ఇస్లామి (హుజీ).. హైదరాబాద్‌ను షెల్టర్‌ జోన్‌గా మార్చుకుంది. నకిలీ ఐడీ కార్డులతో భారతదేశ పాస్‌ పోర్టులను సాధించి ఇప్పటికే 15 మంది విదేశీయులను దేశం దాటించింది. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పోలీసులు నగరాన్ని జల్లెడ పట్టడంతో వీరి గుట్టు బయటపడింది. ఈ తనిఖీల్లో నలుగురు విదేశీయులను, ఇద్దరు స్థానిక ఏజెంట్లను సౌత్‌ జోన్‌ టాస్క్‌ ఫోర్సు […]

హైదరాబాద్‌లో ఆరుగురు హుజి ఉగ్రవాదుల అరెస్ట్
X

ఒకరిది పాక్‌.., మరొకరిది మయన్మార్‌.., ఇద్దరిది బంగ్లాదేశ్‌
నిషేధిత ఉగ్రవాద సంస్థ హర్కత్‌ ఉల్‌ జీహాద్‌ అల్‌ ఇస్లామి (హుజీ).. హైదరాబాద్‌ను షెల్టర్‌ జోన్‌గా మార్చుకుంది. నకిలీ ఐడీ కార్డులతో భారతదేశ పాస్‌ పోర్టులను సాధించి ఇప్పటికే 15 మంది విదేశీయులను దేశం దాటించింది. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పోలీసులు నగరాన్ని జల్లెడ పట్టడంతో వీరి గుట్టు బయటపడింది. ఈ తనిఖీల్లో నలుగురు విదేశీయులను, ఇద్దరు స్థానిక ఏజెంట్లను సౌత్‌ జోన్‌ టాస్క్‌ ఫోర్సు పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసులు నిఘా వేసి అరెస్ట్‌ చేసిన వారిలో నాసిర్‌, ఫైజల్‌ అహ్మద్‌, జాయ్‌నల్‌ అబేడిన్‌, జియా ఉర్‌రెహ్మాన్‌, సోహైల్‌ పర్వేజ్‌ఖాన్‌, మసూద్‌ ఆలీ ఖాన్‌ ఉన్నారు. వీరిలో నలుగురు విదేశీయుల్లో ఇద్దరు బంగ్లాదేశీయులు, ఒక పాకిస్థానీ, మరొకరు మయన్మార్‌ దేశీయుడు ఉన్నారు. నకిలీ ఐడీ కార్డులతో వారికి పాస్‌పోర్టులు ఇప్పించే ఏజెంట్లలో నగరానికి చెందిన జిరాక్స్‌ షాపు యజమాని, ఒక ఉపాధ్యాయుడు ఉన్నారు. నిందితులను కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి నాలుగు భారత పాస్‌పోర్టులు, ఒక బంగ్లాదేశ్‌ పాస్‌పోర్టు, 9 సిమ్‌కార్డులతో కూడిన సెల్‌ఫోన్లు, జీహాద్‌ సాహిత్యం, 100 నకిలీ గుర్తింపు కార్డులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
బంగ్లాదేశ్‌కు చెందిన మహ్మద్‌ నాసిర్‌ 30 ఏళ్ల క్రితం పాకిస్థాన్‌లో స్థిరపడ్డాడు. ఇతని సమీప బంధువు అబ్దుల్‌ జబ్బార్‌ కూడా పాకిస్థాన్‌లో స్థిరపడి నిషేధిత హుజీలో అగ్ర నాయకుడిగా వ్యవహరిస్తున్నాడు. అయితే, ప్రస్తుతం అతడు బంగ్లాదేశ్‌లోని కాక్స్‌ బజార్‌లో నివసిస్తున్నాడు. జబ్బార్‌ ఆదేశాల మేరకు నాసిర్‌ తన భార్యతో కలిసి బంగ్లాదేశ్‌ నుంచి 2010లో దేశంలోకి ప్రవేశించాడు. ఆ ఏడాది మార్చిలో నగరానికి వచ్చి సైబరాబాద్‌లోని జల్‌పల్లిలో స్థిరపడ్డాడు. భార్యాభర్తలు స్థానికులకు యునాని వైద్యం అందిస్తూ ఆ ముసుగులో నగరంలో హుజీ ఉగ్రవాద కార్యక్రమాలకు ఊతం ఇస్తున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌ జంట బాంబు పేలుళ్ల నిందితుడైన పాకిస్థానీ జియా ఉర్‌ రెహ్మాన్‌ అలియాస్‌ వాక్వాస్‌ పశ్చిమబెంగాల్‌ నుంచి బంగ్లాదేశ్‌కు పారిపోవడానికి సహకరించింది నాసిరే. ఇలా నాసిర్‌ స్లీపర్‌సెల్‌గా నగరంలో ఉంటూ ఉగ్రవాద కార్యక్రమాలు జరిగినప్పుడు తన వంతు సహాయం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే.. బాలపూర్‌కు చెందిన ఉపాధ్యాయుడు సోహైల్‌ పర్వేజ్‌ ఖాన్‌తో నాసిర్‌ సంబంధాలు ఏర్పరచుకున్నాడు. సోహైల్‌కు.. చంచల్‌గూడకు చెందిన జిరాక్స్‌ సెంటర్‌ యజమాని మసూద్‌ ఆలీ ఖాన్‌తో సంబంధాలున్నాయి. అనంతరం.. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, మయన్మార్‌ దేశాలకు చెందిన వారికి మసూద్‌ ఆలీ ఖాన్‌ తన ఇంట్లోని ఓ పోర్షన్‌లో ఆశ్రయమిచ్చాడు. వారికి స్థానిక చిరునామాతో ఓటర్‌ ఐడీ కార్డులు, దాని ద్వారా ఆధార్‌ కార్డులకు దరఖాస్తు చేశాడు. ఈ గుర్తింపు కార్డులు వచ్చాక వారు పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేశారు. ఇలా నకిలీ ఐడీ కార్డుల ద్వారా భారత దేశ పాస్‌పోర్ట్‌ పొందిన 15 మంది విదేశీయులు ఇప్పటికే ఇతర దేశాలకు వెళ్లిపోయారు.

First Published:  14 Aug 2015 8:54 PM GMT
Next Story