ఉగ్రవాదాన్ని ఉపేక్షించం: రాష్ట్రపతి హెచ్చరిక
భారత జాతి ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి ఎన్నో దుష్ట శక్తులు కుట్రలు చేస్తున్నాయని, వాటిని సహనంతో, చాకచక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పదేళ్ల దేశ ఆర్థిక ప్రగతి ప్రశంసనీయంగా ఉందన్నారు. విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులపై రాష్ట్రపతి ఆవేదన వ్యక్తం చేశారు. గురుశిష్యుల బంధానికి అర్థం మారిపోతోందని ఆందోళన చెందారు. ఉగ్రవాదులకు సిద్ధాంతం, మతం లేదని, భారత వ్యతిరేక కార్యకలాపాలకు ఉగ్రవాదులు తమ భూభాగాన్ని అడ్డాగా మార్చుకోవడానికి పొరుగు దేశాలు సహకరించకూడదని గట్టిగా హెచ్చరించారు. అర్ధవంతమైన చర్చలకుతో శోభిల్లవలసిన […]
భారత జాతి ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి ఎన్నో దుష్ట శక్తులు కుట్రలు చేస్తున్నాయని, వాటిని సహనంతో, చాకచక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పదేళ్ల దేశ ఆర్థిక ప్రగతి ప్రశంసనీయంగా ఉందన్నారు. విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులపై రాష్ట్రపతి ఆవేదన వ్యక్తం చేశారు. గురుశిష్యుల బంధానికి అర్థం మారిపోతోందని ఆందోళన చెందారు. ఉగ్రవాదులకు సిద్ధాంతం, మతం లేదని, భారత వ్యతిరేక కార్యకలాపాలకు ఉగ్రవాదులు తమ భూభాగాన్ని అడ్డాగా మార్చుకోవడానికి పొరుగు దేశాలు సహకరించకూడదని గట్టిగా హెచ్చరించారు. అర్ధవంతమైన చర్చలకుతో శోభిల్లవలసిన పార్లమెంటు యుద్ధభూమిగా మారిందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం ఒత్తిడికి గురవుతోందని, రాజకీయ పార్టీలు ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. 69వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని శుక్రవారం రాత్రి ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.
‘‘భారతదేశం విలువలతో కూడిన సమాజం. మనం పాటించే విలువలు దేశాభివృద్ధికి దోహదం చేస్తాయి భారతదేశానికి పటిష్ఠమైన రాజ్యాంగం ఉంది. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం అత్యంత విలువైనది. ప్రజాస్వామ్యమనే అతి పెద్ద వృక్షానికి వేళ్లు బలంగా ఉన్నాయి. కానీ, ఆకులు మాత్రం వాడిపోయి పచ్చదనం కోల్పోతోంది. మనం పునఃపరిశీలన చేసుకోవాల్సిన తరుణమిదే’’ అని స్పష్టం చేశారు. ‘‘ప్రజాస్వామ్య సంస్థలు ఒత్తిడిలో ఉంటే.. ప్రజలు, రాజకీయ పార్టీలు తీవ్రంగా లోతుగా ఆలోచించాల్సిన తరుణం ఇదే. మనం కనక ఇప్పుడు స్పందించకపోతే, సరైన చర్యలు తీసుకోకపోతే, 1947లో భారత కలను సాకారం చేసిన యోధులకు మనం ఇస్తున్న గౌరవం, మర్యాదలను మన ముందు తరాలు మనకు ఇస్తాయా? దీనికి జవాబు సంతృప్తికరంగా ఉండకపోవచ్చు. కానీ, ఈ ప్రశ్నను మాత్రం వేసుకుని తీరాల్సిందే’’ అని ప్రణబ్ వ్యాఖ్యానించారు.