Telugu Global
Others

పట్టిసీమ పథకం జాతికి అంకితం చేసిన సీఎం

పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆంద్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎన్‌. చంద్రబాబునాయుడు శనివారం జాతికి అంకితం చేయడం ద్వారా నదుల అనుసంధానానికి తొలి అడుగు వేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు వద్ద సీఎం పైలాన్‌ను ఆవిష్కరించారు. దీంతో అనంతరం ఆయన పంప్‌హౌస్‌ సమీపంలో పనులను పరిశీలించి పురోగతిని సమీక్షించారు. పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టు పురోగతిపై ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. మార్చి 29న శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముందు చెప్పినట్టే ఆగస్టు 15న జాతికి […]

పట్టిసీమ పథకం జాతికి అంకితం చేసిన సీఎం
X
పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆంద్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎన్‌. చంద్రబాబునాయుడు శనివారం జాతికి అంకితం చేయడం ద్వారా నదుల అనుసంధానానికి తొలి అడుగు వేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు వద్ద సీఎం పైలాన్‌ను ఆవిష్కరించారు. దీంతో అనంతరం ఆయన పంప్‌హౌస్‌ సమీపంలో పనులను పరిశీలించి పురోగతిని సమీక్షించారు. పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టు పురోగతిపై ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. మార్చి 29న శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముందు చెప్పినట్టే ఆగస్టు 15న జాతికి అంకితం చేశారు. నెలాఖరులోగా కృష్ణా నదికి తొలి దశలో గోదావరి నీరు విడుదలవుతుంది. గోదావరి నీరు ఎత్తిపోతలకు 24 వెర్టికల్‌ టర్బైన్‌ల ఏర్పాటు చేశారు. ప్రతియేటా 80 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణా నదికి తరలించాలని లక్ష్యంగా నిర్ణయించి ఆమేరకు ప్రణాళిక రూపొందించారు. ఎత్తిపోతల ద్వారా రోజుకు సుమారు 800 క్యూసెక్కుల నీరు కృష్ణానదికి చేరుతుంది. పైలాన్‌ ఆవిష్కరణ అయిన తర్వాత అధికారులు ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన పట్టిసీమ ప్రాజెక్టు ఛాయాచిత్ర ప్రదర్శనను ఆయన తిలకించారు. ప్రాజెక్టు వద్దకు పెద్ద సంఖ్యలో రైతులు, స్థానికులు తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఇరిగేషన్‌ మంత్రి దేవినేని ఉమ, పీతల సుజాత, మాణిక్యాలరావు, మృణాళినితోపాటు ఎమ్మెల్యేలు ముడియం శ్రీనివాస్‌, మాగంటి బాబు, అంజిబాబు, నర్సాపురం ఎంపీ తదితరులు పాల్గొన్నారు.
First Published:  15 Aug 2015 5:23 AM GMT
Next Story