Telugu Global
Cinema & Entertainment

సంక్రాంతి కానుకగా ఎన్టీఆర్ సినిమా

ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ లండన్ లో జరుగుతోంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 8న ఎన్టీఆర్-సుకుమార్ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. వచ్చేనెల 20వ తేదీ వరకు లండన్ లోనే ఈ సినిమాను కంప్లీట్ చేయాలనుకుంటున్నారు. ఆ తర్వాత మరో 20 రోజులు స్పెయిన్ లో షూటింగ్ ప్లాన్ చేశారు. దీంతో మొత్తం షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఎన్టీఆర్ సరసన రకుల్ […]

సంక్రాంతి కానుకగా ఎన్టీఆర్ సినిమా
X
ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ లండన్ లో జరుగుతోంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 8న ఎన్టీఆర్-సుకుమార్ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. వచ్చేనెల 20వ తేదీ వరకు లండన్ లోనే ఈ సినిమాను కంప్లీట్ చేయాలనుకుంటున్నారు. ఆ తర్వాత మరో 20 రోజులు స్పెయిన్ లో షూటింగ్ ప్లాన్ చేశారు. దీంతో మొత్తం షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.
నిజానికి ఆగస్ట్ 15 కానుకగా ఈ సినిమాకు సంబంధించిన నయా స్టిల్ విడుదల చేస్తారని అంతా భావించారు. కానీ సేమ్ గెటప్ తో మరో స్టిల్ రిలీజ్ చేసి చేతులు దులుపుకున్నారు. సినిమాలో ఖరీదైన బైక్ వాడుతున్నామని దర్శకుడు ప్రకటించాడు తప్ప ఆ బైక్ స్టిల్స్ ను బయటపెట్టలేదు. దీంతో నందమూరి అభిమానులు నిరాశకు గురయ్యారు. అయితే సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టు ప్రకటించి అందర్లో జోష్ నింపాడు ఎన్టీఆర్.
First Published:  15 Aug 2015 12:30 AM IST
Next Story