మార్చి నుంచి 9 గంటల విద్యుత్: కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే మార్చి నాటికి రైతులకు 9 గంటల విద్యుత్ అందజేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. 69వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండలో కేసీఆర్ జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కోతలు లేని విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. త్వరలో విద్యుత్ కష్టాలు పూర్తిగా తొలగిపోతాయని ఆయన అన్నారు. మిషన్ కాకతీయ పథకాన్ని రైతులు ఉపయోగించుకోవాలని సీఎం సూచించారు. ఈ యేడాది 8 వేల చెరువుల పూడిక […]
BY sarvi15 Aug 2015 2:31 AM GMT
X
sarvi Updated On: 15 Aug 2015 3:09 AM GMT
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే మార్చి నాటికి రైతులకు 9 గంటల విద్యుత్ అందజేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. 69వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండలో కేసీఆర్ జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కోతలు లేని విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. త్వరలో విద్యుత్ కష్టాలు పూర్తిగా తొలగిపోతాయని ఆయన అన్నారు. మిషన్ కాకతీయ పథకాన్ని రైతులు ఉపయోగించుకోవాలని సీఎం సూచించారు. ఈ యేడాది 8 వేల చెరువుల పూడిక తీశారని, ఇక ఏటా 9 వేల చెరువులకు మరమ్మతులు చేయనున్నామని కేసీఆర్ వివరించారు. పరిశ్రమల ఏర్పాటుకు లక్షా 50 వేల ఎకరాల భూమిని పరిశ్రమల శాఖకు కేటాయించామన్నారు. తెలంగాణలో ఇటీవల జరిగిన గోదావరి మహా పుష్కరాలకు ఘనంగా నిర్వహించామని కేసీఆర్ పేర్కొన్నారు.
ప్రజల ముందుకు త్వరలో బృహత్ నీటిపారుదల పథకాన్ని తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. హైదరాబాద్ తాగునీటి సమస్య పరిష్కారం కోసం 30 టీఎంసీల సామర్థ్యంతో రెండు రిజర్వాయర్లను నిర్మిస్తామని కేసీఆర్ వెల్లడించారు. గ్రామాలను అభివృద్ధి చేసేందుకే గ్రామజ్యోతి పథకాన్ని ప్రవేశపెట్టామని వివరించారు. వచ్చే ఏడాది రానున్న కృష్ణా పుష్కరాలకు ప్రభుత్వం సన్నద్ధమవుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. సంక్షేమ రంగంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని ఉద్ఘాటించారు. నీటిపారుదల, విద్యుత్, వ్యవసాయరంగం, సంక్షేమ రంగాల్లో సత్ఫలితాలు సాధించామని తెలిపారు. సంక్షేమా రంగానికి బడ్జెట్‌లో రూ.28 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. రుణమాఫీ కింద రైతులకు 2 విడతల్లో రూ.8,500 కోట్లు చెల్లించామన్నారు. అలాగే ధరల స్థిరీకరణకు రూ.400 కోట్లు కేటాయించినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.
Next Story