తెలంగాణ పాఠశాలల్లో డిజిటల్ పాఠాలు
ఈ విద్యా సంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వం అందించే డిజిటల్ ఇండియా పథకం కింద రాష్ట్రంలోని వంద ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ పాఠాలు బోధించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. కంప్యూటర్ విద్య, డిజిటల్ పాఠాలపై పాఠశాల విద్యా డైరెక్టర్ చిరంజీవులు శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరీంనగర్‌కు చెందిన ఉపాధ్యాయులు 4,5 తరగతుల్లో పర్యావరణకు విద్యకు సంబంధించి డిజిటల్ పాఠాలు రూపొందించారు. మిగతా తరగతులకు కూడా డిజిటల్ పాఠాలు బోధించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. అంతేకాకుండా ఇంటర్నెట్ […]
BY sarvi14 Aug 2015 1:10 PM GMT
X
sarvi Updated On: 15 Aug 2015 1:19 AM GMT
ఈ విద్యా సంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వం అందించే డిజిటల్ ఇండియా పథకం కింద రాష్ట్రంలోని వంద ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ పాఠాలు బోధించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. కంప్యూటర్ విద్య, డిజిటల్ పాఠాలపై పాఠశాల విద్యా డైరెక్టర్ చిరంజీవులు శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరీంనగర్‌కు చెందిన ఉపాధ్యాయులు 4,5 తరగతుల్లో పర్యావరణకు విద్యకు సంబంధించి డిజిటల్ పాఠాలు రూపొందించారు. మిగతా తరగతులకు కూడా డిజిటల్ పాఠాలు బోధించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. అంతేకాకుండా ఇంటర్నెట్ సదుపాయం ఉన్న పాఠశాలల్లోని టీచర్లకు ఆన్‌లైన్ ద్వారా ఇంగ్లీష్ కూడా నేర్పాలని విద్యాశాఖ భావిస్తోంది.
Next Story