ప్యాకేజీ, హోదాకు తేడా చౌదరికి తెలీదు: సీఎం
ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ మధ్య తేడాపై కేంద్ర మంత్రి సుజనా చౌదరికి ఐడియా లేదు. అందుకే, ఆయన ప్రత్యేక ప్యాకేజీ గురించి మాట్లాడారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా కోసం ప్రధానితో మాట్లాడేందుకు ఆయన పిలుపు కోసం వేచి చూస్తున్నానని సీఎం అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించిన తీరు, పార్టీల తీరు, పార్లమెంటులో ఆమోదం అనే అంశాలపై వివరణ పత్రం […]
BY sarvi14 Aug 2015 6:38 PM IST

X
sarvi Updated On: 15 Aug 2015 6:33 AM IST
ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ మధ్య తేడాపై కేంద్ర మంత్రి సుజనా చౌదరికి ఐడియా లేదు. అందుకే, ఆయన ప్రత్యేక ప్యాకేజీ గురించి మాట్లాడారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా కోసం ప్రధానితో మాట్లాడేందుకు ఆయన పిలుపు కోసం వేచి చూస్తున్నానని సీఎం అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించిన తీరు, పార్టీల తీరు, పార్లమెంటులో ఆమోదం అనే అంశాలపై వివరణ పత్రం -2ను ఆయన విడుదల చేశారు.
Next Story