సినిమా చూపిస్తా మావ మూవీ రివ్యూ
రేటింగ్.2.75 ఉయ్యాలా జంపాలా’ సినిమాతో సూపర్ హిట్ అనిపించుకున్న కొత్త జంట రాజ్ తరుణ్ – అవిక గోర్. వీరిద్దరి కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ రేసుగుర్రం సినిమాలో బాగా ఫేమస్ అయిన సాంగ్ లిరిక్ ని టైటిల్ గా పెట్టి చేసిన సినిమా ‘సినిమా చూపిస్త మావ’. ‘మేం వయసుకు వచ్చాం’ ఫేం త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ సినిమాకి శేఖర్ చంద్ర మ్యూజిక్ అందించాడు. బి.అంజిరెడ్డి, బి.వేణుగోపాల్, రూపేష్.డి, జి.సునీతలు కలిసి నిర్మించిన […]
రేటింగ్.2.75
ఉయ్యాలా జంపాలా’ సినిమాతో సూపర్ హిట్ అనిపించుకున్న కొత్త జంట రాజ్ తరుణ్ – అవిక గోర్. వీరిద్దరి కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ రేసుగుర్రం సినిమాలో బాగా ఫేమస్ అయిన సాంగ్ లిరిక్ ని టైటిల్ గా పెట్టి చేసిన సినిమా ‘సినిమా చూపిస్త మావ’. ‘మేం వయసుకు వచ్చాం’ ఫేం త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ సినిమాకి శేఖర్ చంద్ర మ్యూజిక్ అందించాడు. బి.అంజిరెడ్డి, బి.వేణుగోపాల్, రూపేష్.డి, జి.సునీతలు కలిసి నిర్మించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి మొదటి సినిమాతో హిట్ పెయిర్ అనిపించుకున్న ఈ జంట రెండవ సినిమాతో కూడా హిట్ పెయిర్ అనిపించుకుందా లేదా అన్నది ఇప్పుడు చూద్దాం…
కథ
సినిమా చూపిస్తా మామ చిత్రం కథ రెగ్యులర్ లవ్ స్టోరి. కత్తి అలియాస్ రాజ్ తరుణ్ ( హీరో) ఒక బీదింటి కుర్రాడు. ఇంటర్మీడియట్ రెండు స్లార్లు ఫెయిల్ అయ్యి తండ్రి చేత రొడ్డు మీద దెబ్బలు తినే ఆర్డనరి యంగ్ మెన్. ఇటువంటి జులాయి కి ఒన్ ఫైన్ మార్నింగ్.. చదువుల తల్లి పరిణితి అలియాస్ అవిక గోర్ కంట పడుతుంది. ఇంటర్మిడియట్ లో స్టేట్ ర్యాంకర్ ఈ చదువుల తల్లి.. ప్రతి విషయంలోను క్వాలిటి కోరుకునే సోమనాధ్ ఛటర్జీ అలియాస్ రావు రమేష్ కూతురు. తండ్రి తన మీద పెట్టిన నమ్మకాన్ని నిజం చేయడానికి తన ఇన్నర్ ఫీలింగ్స్ ను చంపుకుని జీవించే అమ్మాయి. మాట, జీవితం, జీతం, డ్రెస్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ క్వాలిటి కోరుకునే సోమనాథ్ ఛటర్జీ కి పక్కలో బల్లెంలా హీరో తయారవుతాడు. పరిణితిని ప్రేమించి.. ఆమె తండ్రికి నిద్రలేకుండా చేస్తాడు హీరో కత్తి. ఎలాగైన కత్తిని వదిలించుకోవాలనే ప్రయత్నంలో… తన కూతుర్ని పెళ్లి చేసుకోవాలంటే.. ఒక నెల రోజుల పాటు తన కుటుంబాన్ని తన స్థాయికి తగ్గకుండ అయ్యే ఖర్చును హీరో కత్తి స్వయంగా సంపాదించిన డబ్బుతో పోషించాలని అగ్రిమెంట్ పెట్టుకుంటారు. హీరో ఓడి పోతే మామ కానీ మామ కాళ్లు పట్టుకుని శాశ్వతంగా తన కూతుర్ని వదిలేసి వెళ్లాలి. అదే హీరో కత్తి పందెంలో గెలిస్తే.. తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలి. ఇది కథ. మరి ఎవర్ని ఎవరు గెలిచారు..? చివరకు కథ ఎలా ముగిసింది అనేది సినిమా .
ప్లస్ పాయింట్స్ :
అల్రెడి ఉయాలా జంపాలా చిత్రం తో హిట్ పెయిర్ అనిపించుకున్న అవిక గోర్..రాజ తరుణ్ ను ఎంపిక చేసుకోవడం .. యూత్ ఆడియన్స్ ను టార్గెట్ చేసి కథను రాసుకుని విజయవంతంగా స్క్రీన్ ప్లే చే్యడం ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్. జబర్ధస్థ్ లో కనిపించిన చాల మంది ఆర్టిస్ట్ ల్ని సందర్భోచితంగా ఉపయోగించుకుని సన్నివేశాలు పండించారు డైరెక్టర్ త్రినాధ్. అలాగే టైటిల్ సాంగ్ తో పాటు .. మరో రెండు పాటలకు శేఖర్ చంద్ర సంగీతం బావుంది. యాక్టింగ్ పరంగా రాజ్ తరుణ్ కు ఎక్కువ స్కోప్ ఇచ్చారు. అవిక గౌర్ కి సెకండాఫ్ లో పెద్దగా స్కోప్ లేదు. సెకండాఫ్ అంతా హీరో .. హరోయిన్ తండ్రిగా చేసిన రావు రమేష్ ల మధ్య నడిపించారు. అయితే ప్రథమార్దంలోను.. ద్వితియార్దంలోను కొన్ని సన్నివేశాలు బాగా సాగిదీసినట్లు అనిపిస్తాయి. అయితే వినోదం సెంట్రిక్ గా ఉండటం తో ఆ డల్ సీన్స్ కూడా ..మరీ బోర్ అనిపించవు. బొమ్మరిల్లు చిత్రంలో హీరోయిన్ వచ్చి పెళ్లికి ముందే..ఒక వారం పాటు.. హీరో ఇంట్లో ఉండటం అనేది అప్పట్లో చాల కొత్తగా అనిపించింది. అలాగే ఈ చి్త్రంలో హీరో .. హీరోయిన్ తండ్రి తో పోటి పడి వాళ్ల ఇంట్లో ఉండాల్సి రావడం కాస్త కొత్తగా ..ఆసక్తిగా అనిపిస్తుంది. యాక్టింగ్ పరంగా ముఖ్యంగా ముగ్గురి గురించే చెప్పుకోవాలి. హీరో రాజ్ తరుణ్.. హీరోయిన్ అవిక గోర్.. ఆమె తండ్రి రోల్ చేసిన రావు రమేష్. అసలు స్టోరి మెయిన్ ప్లాట్ పాయింట్ రావు రమేష్ చుట్టే తిరుగుతుంది. ఆయన తన రోల్ ను అద్భుతంగా పోషించారు.
ఇక సినిమాలో చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన పోసాని కృష్ణమురళి, కృష్ణభగవాన్, ప్రవీణ్, చలాకి చంటి, సత్యం రాజేష్, జయలక్ష్మిలు తమ పాత్రల్లో నవ్విస్తే.. అక్కడక్కడ కొన్ని ఎపిసోడ్స్ లో వచ్చే జబర్దస్త్ టీం అయిన శంకర్, శ్రీను, సుధీర్ లు బాగానే నవ్వించారు. ఇక సినిమా ఫ్లో విషయానికి వస్తే.. సినిమా స్టార్టింగ్ చాలా బాగుంటుంది.. మొదటి 30 నిమిషాలు కథలోకి చాలా వేగంగా వెళ్ళడమే కాకుండా, ఫన్నీగా కూడా ఉంటుంది. ఆ తర్వాత వచ్చే ద్రౌపదీ వస్త్రాపహరణం సీన్ బాగా నవ్విస్తుంది. ఇక సెకండాఫ్ లో రాజ్ తరుణ్ – రావు రమేష్ ల మధ్య వచ్చే చాలెంజింగ్ సీన్ మాస్ ని బాగా ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత వచ్చే కృష్ణ భగవాన్ – చలాకి చంటి- రాజ్ తరుణ్ మధ్య వచ్చే భోజనాల ఎపిసోడ్ నవ్విస్తుంది. క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్ పరవాలేదనిపిస్తుంది.
మైనస్ పాయింట్స్ :
కథనం పరంగా సినిమాలో దాదాపు మనం అనుకున్నవే జరుగుతూ ఉండడం వల్ల చూసే ఆడియన్స్ కి కంటెంట్ పరంగా పెద్ద కిక్ ఉండదు. శేఖర్ చంద్ర సాంగ్స్ బాగున్నాయి, పిక్చరైజేషన్ ఇంకా బాగుంది, కానీ అవి వచ్చే సందర్భం సరిగ్గా లేదు. సెకండాఫ్ లో అయితే పాట తర్వాత పాట వస్తూ ఉంటుంది. ఏదో కమర్షియాలిటీ కోసం పెట్టారు తప్ప పెద్ద ఉపయోగం లేదు. ప్రధమార్ధం మంచి కామెడితో బాగా డీల్ చేసిన డైరెక్టర్ సెకండాఫ్ మీద తన గ్రిప్ప్ ను చూపలేక పోయాడనిపిస్తుంది. క్లైమాక్స్ ఎపిసోడ్ లో హీరోయిన్ చావు బతుకుల్లో ఉన్నప్పుడు. హీరోయిన్ తండ్రి మీద కోపం తో ( ప్రభుత్వ విభాగంలో మెడికల్ కౌన్సిల్ లో సెక్రటరి అయిన రావు రమేష్.. డాక్టర్ పోసానిని క్వాలిటి విషయంలో సరిగా చేయలేదని గతంలో అతని మీద కేసు పెట్టిస్తాడు..ఆ కోపం తో అపరేషన్ చేయడానికి నిరాకరిస్తాడు.) డాక్టర్ ఆపరేషన్ కు రిజెక్ట్ చేసే సీన్ .. పేలవంగా ఉంది. ఈ ఎపిసోడ్ లో ఆడియన్స్ కు హీరో మీద సానుభూతి , ప్రేమ, అభిమానం రెట్టింపు అయ్యే సన్నివేశం రాసుకోవడానికి స్కోప్ ఉంది. కానీ డైరెక్టర్ ఇక్కడ చాల లైట్ గా తీసుకున్నాడు. అంతకు మించి చేయలేక పోయడనుకోవాలి.
సాంకేతిక విభాగం :
సాంకేతిక విభాగంలో సినిమాకి బాగా హెల్ప్ అయిన అంశాలు చాలానే ఉన్నాయి. ముందుగా శేఖర్ చంద్ర మ్యూజిక్.. తను అందించిన పాటలు అన్నీ బాగున్నాయి, అలాగే ఈ ఫన్ ఎంటర్టైనర్ కి పర్ఫెక్ట్ గా అనిపించే నేపధ్య సంగీతం ఇచ్చాడు. ఇక సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి లొకేషన్ మరియు ప్రతి పాత్రని చాలా బాగా చూపించాడు. లైటింగ్ ఎఫెక్ట్స్ ని బాగా వాడుకున్నాడు. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ జస్ట్ ఓకే. ఇంకా చాలా చోట్ల ట్రిమ్ చేసి ఉంటే సినిమాకి బాగా హెల్ప్ అయ్యేది. ప్రసన్న జె కుమార్ రాసిన డైలాగ్స్ సినిమాకి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు.
తీర్పు :
సినిమా చూపిస్తా మామ. టైటిల్ ను బట్టి..అల్లుడు మామకు బాగా సినిమా చూపించాడనుకుంటాం. కానీ.. సినిమాలో ఇందుకు రివర్స్ జరుగుద్ది. కాబోయో మామగారే అల్లుడుకు సినిమా చూపిస్తాడు. అయితే మామ చూపించే సినిమాకు ..అల్లుడు తనదైన మార్క్ సోల్యూషన్ ను చూపిస్తూ..ఆడియన్స్ ను మెప్పించాడు. రాజ్ తరుణ్ యాక్టింగ్ పరంగా మరింత పరిణితి కనబరిచాడు. హీరోయిన్ అవిక క్యూట్ గా ఉంది. బొద్దుగా కనిపిస్తుంది. ఫైనల్ గా డైరెక్టర్ అన్ని విభాగాల్ని సమన్వయం చేసుకుని.. ఆడియన్స్ ను నవ్వించాడు.