ప్రతిష్ట కోసం తిప్పలు పడుతున్న టీ-టీడీపీ
తెలంగాణ టీడీపీ నేతలు ఓటుకు కోట్లు కేసులో పార్టీకి జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు, ప్రజలతో మమేకం కావడానికి ప్రయత్నిస్తున్నారు. యాత్రలు, పర్యటనలు పేరుతో కొందరు టీటీడీపీ నేతలు ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే వలసలతో చిక్కిశల్యమైన పార్టీకి ఓటుకు నోటు విషయంలో రేవంత్ రెడ్డి బహిరంగంగా పట్టుబడడం, ఏపీ సీఎం ఆడియోటేపులతో ప్రజల్లోకి ఉత్సాహంగా వెళ్లలేక పోతోంది. అయితే, ఈపరిస్థితులను చక్కదిద్దేందుకు కొంతమంది నేతలు నడుం బిగించారు. టీ.టీడీపీ శాసనసభాపక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, టీ.టీడీపీ అధ్యక్షుడు […]
BY sarvi14 Aug 2015 2:02 AM GMT
X
sarvi Updated On: 14 Aug 2015 2:02 AM GMT
తెలంగాణ టీడీపీ నేతలు ఓటుకు కోట్లు కేసులో పార్టీకి జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు, ప్రజలతో మమేకం కావడానికి ప్రయత్నిస్తున్నారు. యాత్రలు, పర్యటనలు పేరుతో కొందరు టీటీడీపీ నేతలు ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే వలసలతో చిక్కిశల్యమైన పార్టీకి ఓటుకు నోటు విషయంలో రేవంత్ రెడ్డి బహిరంగంగా పట్టుబడడం, ఏపీ సీఎం ఆడియోటేపులతో ప్రజల్లోకి ఉత్సాహంగా వెళ్లలేక పోతోంది. అయితే, ఈపరిస్థితులను చక్కదిద్దేందుకు కొంతమంది నేతలు నడుం బిగించారు. టీ.టీడీపీ శాసనసభాపక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, టీ.టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి తదితర్లు జిల్లాల పర్యటనలు, నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ముగ్గురు నేతలు జిల్లా యాత్రలు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు చెల్లించాలని, పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టించాలని ఎర్రబెల్లి ఒక్కరోజు నిరాహారదీక్ష చేసి ప్రజల్లో కొంత సానుభూతి సంపాదిస్తుండగానే,. ప్రభుత్వం తలపెట్టిన పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా ఏపీ సీఎం లేఖ రాయడంతో వారి పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఉమ్మడి ప్రభుత్వంలో నీటి ప్రాజెక్టులకు టీడీపీ కేటాయింపులను వివరిస్తూ మళ్లీ ముగ్గురు నేతలు పాలమూరు బాట పట్టారు. ఈ పరిస్తితి సద్దుమణిగేలోపు ఏపీ సీఎం మళ్లీ ఏం కష్టాలు తెస్తాడోనని బిక్కుబిక్కుమంటున్నారు.
Next Story