Telugu Global
Others

ప్రాణహిత-చేవెళ్లపై ఒక్కటైన విపక్షాలు

ప్రాణహిత-చేవెళ్ల విషయంలో సీఎం కేసీఆర్‌ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్‌తోసహా విపక్షాలు మండిపడ్డాయి. డిజైన్‌ మార్చవద్దంటూ అఖిలపక్ష నేతలు కేసీఆర్‌ను కలవాలన్నారు. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ కమిటీ ఆధ్వర్యంలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులపై శుక్రవారం రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు.  ఈసమావేశానికి కాంగ్రెస్‌ నాయకులతోపాటు సీపీఐ, సీపీఎం, బీజేపీ నాయకులు హాజరయ్యారు. డిజైన్‌ మార్చడం వల్ల రంగారెడ్డి, హైదరాబాద్‌కే కాదు ఆదిలాబాద్‌ జిల్లాకూ అన్యాయం జరుగుతుందని గుండామల్లేశ్‌ చెప్పారు. సీఎం కేసీఆర్‌ వినకపోతే కేంద్ర జలవనరుల మంత్రిని కలుస్తామని […]

ప్రాణహిత-చేవెళ్లపై ఒక్కటైన విపక్షాలు
X
ప్రాణహిత-చేవెళ్ల విషయంలో సీఎం కేసీఆర్‌ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్‌తోసహా విపక్షాలు మండిపడ్డాయి. డిజైన్‌ మార్చవద్దంటూ అఖిలపక్ష నేతలు కేసీఆర్‌ను కలవాలన్నారు. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ కమిటీ ఆధ్వర్యంలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులపై శుక్రవారం రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈసమావేశానికి కాంగ్రెస్‌ నాయకులతోపాటు సీపీఐ, సీపీఎం, బీజేపీ నాయకులు హాజరయ్యారు. డిజైన్‌ మార్చడం వల్ల రంగారెడ్డి, హైదరాబాద్‌కే కాదు ఆదిలాబాద్‌ జిల్లాకూ అన్యాయం జరుగుతుందని గుండామల్లేశ్‌ చెప్పారు. సీఎం కేసీఆర్‌ వినకపోతే కేంద్ర జలవనరుల మంత్రిని కలుస్తామని గుండా మల్లేశ్‌ స్పష్టం చేశారు. సెక్రటేరియట్‌ను ఎర్రగడ్డకు, ఎర్రగడ్డను సెక్రటేరియట్‌కు మార్చేస్తామంటూ పిచ్చిపిచ్చి ప్రకటనలు చేస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ మెడలో ఓ నరం దెబ్బతిందన్న అనుమానం తమకు ఉందని, డాక్టర్లను సంప్రదించాలని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి సలహా ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా పశ్చిమ ప్రాంతంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. రంగారెడ్డి జిల్లా భూములను అమ్మి ఇతర ప్రాజెక్టులకు నిధులు మళ్లిస్తే ఉద్యమిస్తామని సబిత హెచ్చరించారు. బీజేపీ ఎమ్మెల్సీ రాంచదర్‌రావు మాట్లాడుతూ ఇప్పటికే ప్రాణహిత-చేవెళ్లకు రూ.కోట్లు ఖర్చు చేశారని, ప్రాజెక్టుపై ఓ నిర్ణయం తీసుకుని కేంద్రానికి నివేదించనున్నట్లు తెలిపారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి మాజీమంత్రి సబితాఇంద్రారెడ్డి, గుండామల్లేశ్‌, ప్రకాశ్‌గౌడ్‌, రాంచంద్‌రావు హాజరయ్యారు.
First Published:  14 Aug 2015 10:16 AM IST
Next Story